Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సంక్రాంతి పండుగ యెక్క విశేషాలు..!

Category : village history

సంక్రాంతి పండుగ అనేది, సంక్రమణము అంటే మారడం అని అర్థం.

సూర్యుడు "మేషాది ద్వాదశ రాశుల " నుంచి క్రమ క్రమంగా "పూర్వరాశి నుంచి ఉత్తర రాశి" లోకి చేరడాన్ని సంక్రాంతి గా జరుపు కుంటారు. ఇలా ఏడాది పొడవునా 12 సంక్రాంతులు ఉంటాయి. వీటిలో ప్రముఖంగా అంతా 'మకర సంక్రాంతికి' చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇది ఏడాదిలో జనవరి నెలలో వస్తుంది. జనవరి 14,15 తేదీల్లో సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగు పెట్టడం జరుగుతుంది. ఇలా జరిగే ఈ రోజు మంచి రోజుగా అన్ని పుణ్య కార్యాలకు వేదికగా పురాణాలలో చెప్పడం జరిగింది .

సంక్రాంతి పండుగ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది, అందులో పిల్లలకి బాగా నచ్చే గాలిపటాలు ఎగురేసే పండుగగా, ఎంతో ఆనందాన్ని కోలాహలం కలిగించే ఈ పండుగ అంటే ఎంతో ఆసక్తి ఉంటుంది. కొత్త ఏడాదిలో కి అడుగుపెట్టిన సందర్భంలో తెలుగువారికి ముందుగా వచ్చే పండుగ కావడం విశేషం. ముఖ్యంగా ఈ పండుగ ఎక్కువగా తెలంగాణలో కంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అధిక సంఖ్యలో జరుపుకుంటారు. ముచ్చటగా మూడు రోజులు జరిగే ఈ పండుగ కి భోగి, మకర సంక్రాంతి,కనుమ అని.... మరికొన్ని చోట్ల నాలుగు రోజు ను కూడా (ముక్కను) అనే పేరుతో జరుపుకుంటారు.

ఈ పండుగ కి ఉన్న ప్రాముఖ్యత విషయానికి వస్తే అధికంగా పల్లెటూరి వాసులు ఎంతో ఆసక్తి గా ఈ పండుగని జరుపుకుంటారు. అదే నగరవాసుల విషయానికి వస్తే పెద్దగా తేలిక పోవచ్చు, అపుడపుడు వారు చూసే సినిమాల్లో ఈ పండుగ యెక్క ప్రాముఖ్యత చూసి ఉంటారు.లేదా వారి వారి సొంత ఊర్లకు వెళ్లే వారికి మాత్రం ఇది ఒక గొప్ప పండుగని తెలుసు. ముఖ్యంగా రైతులకి పంట చేతికి వచ్చిన సందర్భంగా ఆనందంతో ఈ పండుగని జరుపుకుంటారు.

ఈ పండుగ రోజున ఇంటికి 'కొత్త,పాత అల్లుల్లను' ఇంటికి ఆహ్వానించి వారికి అన్ని విధాలుగా మర్యాద పూర్వకంగా గౌరవిస్తారు.

అదే విధంగా ఈ పండుగ ముందు నెల రోజుల నుంచే ఊర్లలో

ప్రతి రోజు ఉదయాన్నే ఇంటి ముంగిళ్ళల్లో (ముగ్గులు)

రంగవల్లులు, గొబ్బెమ్మలు వంటి వాటితో అలంకరిస్తారు. ఇలా ఇంటిలోకి లక్ష్మి దేవిని ఆహ్వానిస్తారు.

ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో చూసుకుంటే కోడి పందాలు, ఎడ్ల పందాలకు పెట్టింది పేరు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అక్కడ జరిగే పందాలకు అందరి చూపు వాటి పైనే ఉంటుంది. ఇలాగే ప్రతి ఊర్లో ఈ సందర్భంగా నెలకొనే సందడి అంతా ఇంతా కాదు..... డూ డూ బసవన్నలు, వోగ్గు, జాణపద కళాకారులు, బుడబుక్కల వాళ్లు, హరినాథ్ లు ఇలా ప్రతి ఒక్కరూ ఊర్లలో చేసే కోలాహలం చాలా గొప్పగా ఉంటుంది.

సంక్రాంతి వంటకాలు:

ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో కూడా నోరూరించే పిండి వంటకాలు పేర్లు వింటేనే ఒకలా ఉంటే, ఇంకా వాటిని చూస్తే ఇంకా, వేరే చెప్పాలా.

ఇలా ఒకటా రెండా వాటి పేర్లు ముఖ్యంగా అరిసెలు, చక్కినాల్, బొబ్బట్లు, జంతికలు, పాలతాలుకలు, సేమియా, గారెలు, పులిహోర, పరమాన్నం ఇలా అనేక రకాల తీపి, పిండి వంటకాలు చేస్తారు

Related News