మొబైల్ మార్కెట్లోకి ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పనిచేసే ఫోన్లు ప్రవేశించక ముందు నోకియా మొబైల్స్‌దే హవా. ఆ సయమంలో కంపెనీ వివిధ రకాల డిజైన్లతో మొబైల్స్‌ను విడుదల చేసేది. ఇప్పుడు మనం చూస్తున్న స్మార్ట్ ఫోన్లన్నీ దాదాపు ఒకే బాడీ డిజైన్‌తో ఉంటున్నాయి. కానీ నోకియా, శాంసంగ్ తదితర కంపెనీలు గతంలో ఫ్లిప్, స్లైడర్ వంటి డిజైన్లతో ఫోన్లను విడుదల చేసేవి. తాజాగా విన్పిస్తున్న ఓ ఆసక్తికర సమాచారం టెక్ ప్రియులను ఆకర్షిస్తోంది. శాంసంగ్ కంపెనీ మళ్లీ ఫ్లిప్ తరహా ఫోన్లను రూపొందిస్తోందట. డబ్ల్యూ 2017 పేరుతో వ్యవహరిస్తున్న ఈ మోడల్ అతి త్వరలో చైనాలో విడుదల చేయబోతున్నారు. అత్యాధునిక ఫీచర్లతో రూపొందుతున్న ఈ మొబైల్‌ను అనంతరం దక్షిణ కొరియాలోనూ విడుదల చేస్తారని సమాచారం. 4.2 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ అంతర్గత మెమొరీ, 12 ఎంపీ రేర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. 4కే నాణ్యతతో వీడియోలను రికార్డ్ చేయొచ్చు. అంతేకాదు వేగవంతమైన ఛార్జింగ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, శాంసంగ్ పే వంటి అదనపు సౌకర్యాలను సైతం పొందుపర్చారు.