//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అదిరిపోయే ఫీచర్స్‌తో శామ్‌సంగ్‌ గెలాక్సీ సి7 ప్రో

Category : business national

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్‌సంగ్‌ భారత్‌లో తన స్మార్ట్‌ఫోన్ మోడళ్లను పెంచుకుంటూ పోతోంది. తాజాగా మరో కొత్త డివైజ్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. శామ్‌సంగ్‌ గెలాక్సీ సి7 ప్రో పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 27,990. బంగారు, నీలం రంగుల్లో ఈ ఫోన్ లభిస్తోంది. ఏప్రిల్ 11 నుంచి అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ప్రారంభమవుతాయి. వాస్తవానికి గెలాక్సీ సి7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో గతేడాదే విడుదల చేశారు.

ఇక ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే..5.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో గెలాక్సీ సి7 ప్రో వస్తోంది. డ్యుయల్ సపోర్ట్‌తో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఓఎస్‌పై పనిచేస్తుంది. 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్‌తో డివైజ్ చాలా పటిష్ఠంగా ఉంది. 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఈ ఫోన్ సొంతం. మైక్రోఎస్డీతో స్టోరేజీని 256జీబీ వరకు పెంచుకోవచ్చు అని తెలిపారు.