//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సంపూ నీ కంపు ఇండస్ట్రీ కి అవసరమా

Category : movies

తెలుగు సినీ ఇండస్ట్రీ కి ఇప్పుడిప్పుడే ప్రపంచ పటం లో గుర్తింపు వస్తుంది .రాజమౌళి లాంటి గ్రేట్ డైరెక్టర్స్ ఉన్న ఈ తెలుగు సినీ ఇండస్ట్రీ ని కొంతమంది తమ స్వార్ద ప్రయోజనాల కోసం నీచాతి నీచంగా చూపిస్తున్నారు . ఇక పొతే గత ఏడాది టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన అర్జునరెడ్డి , కొన్ని రోజుల ముందు మన ముందుకు వచ్చిన RX100 , కంచరపాలెం సినిమాలని బోల్డ్ కథలతో తెరకెక్కించించారు . మొదటి ఈ సినిమాల టీజర్ లని చూసి అందరూ సినిమాలని వ్యక్తిరేకించించారు ,కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి పబ్లిసిటీ లేకుండా ,కేవలం మౌత్ పబ్లిసిటీ తో భారీ విజయాల్ని అందుకున్నాయి . అలాగే ఇండస్ట్రీ పెద్దలనుండి ప్రశంసల్ని కూడా అందుకున్నాయి .Sampu Kobbari Matta Movie

ఇక అసలు విషయానికొస్తే 2014 లో హృదయ కాలేయం అంటూ ఒక విభిన్నమైన పోస్టర్ ని సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసారు . ఆ పోస్టర్ ని చివరికి రాజమౌళి దగ్గరికి వెళ్ళింది . దీనితో రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా ఈ సినిమా నిజంగా వస్తుందా అని ట్విట్ చేయడమే టాలీవుడ్ కి శాపంలాగా మారింది ఇప్పుడు . ఆ సినిమా రిలీజ్ అయ్యాక నిర్మాతల కి లాభాలని తెచ్చి పెట్టింది .అలాగే హీరో సుమపూర్ణేశ్ కి ఇండస్ట్రీ లో ఒక గుర్తింపుని తెచ్చిపెట్టింది . అంతవరకూ అన్ని బాగున్నా ,ఆ చిత్రం ఎలాఉన్నా ఆ చిత్రాని కి ఉన్న క్రేజ్ తో ఆలా నెట్టుకొచ్చాడు సంపూర్ణేష్ . ఆ చిత్రం విజయం సాధించింది. వచ్చిన క్రేజ్ ని నిలబెట్టుకుంటూ అంతమించి ఒక మంచి చిత్రాన్ని చేయటానికి ఎవరైనా ప్రయత్నిస్తారు . కానీ వీరేంటో వెరైటీగా ఆ చిత్రం కన్నా మరీ దిగజారి ,వీరు దిగజారడమే కాకుండా బాహుబలి లాంటి ఇంటర్ నేషనల్ లెవల్ చిత్రాలని అందిస్తున్న మన తెలుగు చిత్ర పరిశ్రమని పరువు కూడా బజారుకీడ్చుతున్నారు. ఇంతలా మాట్లాడటానికి గల ముఖ్య కారణం హృదయకాలేయం టీమ్ నుండి వస్తున్న కొబ్బరిమట్ట టీజర్ . Sampu Kobbari Matta Movie

ఆ టీజర్ గురించి రివ్యూ రాయటానికి రాసే మాకే మనసొప్పలేదు . అన్నదమ్ముల సెంటిమెంట్ తో వచ్చిన చాలా చిత్రాలని తెలుగు ప్రజలు బ్రహ్మరధం పట్టారు .అలనాటి ఎన్టీఆర్ నుండి ఈ నాటి ఎన్టీఆర్ వరకు అన్నదమ్ముల సెంటిమెంట్ తో వచ్చిన ప్రతి సినిమాకూడా మంచి విజయాల్ని అందుకోవడానికి గల కారణం ,మన తెలుగు వారి సంప్రదాయం ,బంధాలు, బంధుత్వాలకి పెద్దపీట వేయడమే . అటువంటు అన్నదమ్ముల బంధాన్ని చాలా నీచంగా చూపించాడు మొన్న రిలీజ్ అయిన కొబ్బరి మట్ట టీజర్ లో ,అలాగే ఇంతకుముందు రిలీజ్ అయిన టీజర్ లో బాలయ్య ని ఇమిటేట్ చేస్తూ ఆడవారి గురించి చెప్పే డైలాగ్ కూడా ఎటకారంగా చెప్పాడు . ఇలాంటి సినిమాలని తీసి మన తెలుగు సభ్య సమాజానికి ఎం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారో ఎవరికీ అర్థంకాలేదు . తెలుగు లో సినిమాలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది . మీరు ఇండస్ట్రీని ఒకమెట్టు ఎక్కించే సినిమాలు తీయాలని ప్రయత్నం చేయద్దు కానీ ,తెలుగు చలన చిత్ర పరిశ్రమను దిగజార్చే సినిమాలని మాత్రం దయచేసి తీయవద్దు . ఇటువంటి బి గ్రేడ్ చిత్రాలు 90 ఏళ్ల చరిత్ర గల మన సినీ ఇండస్ట్రీ కి అవసరమా అని ఒకసారి ఆలోచించుకొని సినిమాలని తీస్తే బాగుండేది .Sampu Kobbari Matta Movie