//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇంద్ర‌గంటి- సమ్మోహనం మూవీ.. బెనిఫిట్ షో టాక్ ఏంటి..?

Category : movies

టాలీవుడ్ క్లాస్ డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం స‌మ్మోహ‌నం. సుధీర్ బాబు హీరోగా న‌టించిన ఈ సినిమాలో బాలీవుడ్ భామ అదితీ రావ్ హైద‌రి హీరోయిన్‌గా న‌టించింది. ఇక ఈ చిత్ర టీజర్ ను మెగా స్టార్ చిరంజీవి విడుదల చేయడం , సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రీ రిలీజ్ వేడుకకు రావడం , చిత్ర వీడియోస్ సైతం చాల కొత్తగా ఉండడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి ఆ అంచనాలకు తగట్టు సినిమా ఉందా..ఇంద్రగంటి మ్యాజిక్ డైరెక్షన్ ఎలా ఉందో.. ఫ‌స్ట్ షో చూసిన‌ ప‌బ్లిక్ టాక్ ఏంటో తెలుసుకుందాం.

ఉదయం నుండి చాల చోట్ల బెనిఫిట్ షోస్ పడడం తో వాటిని చూసిన అభిమానులు వారి స్పందనను సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరుస్తున్నారు. ఇంద్రగంటి డైరెక్షన్‌తో పాటు హీరో హీరోయిన్లు బాగా చేశారంటున్నారు. పి.జి.విందా ఫొటోగ్ర‌ఫీ హైలైట్‌గా ఉందని.. వివేక్ సాగ‌ర్ ట్యూన్లు ఆక‌ట్టుకుంటున్నాయంటున్నారు. టైటిల్‌కి త‌గ్గ‌ట్టుగానే సినిమా మొత్తం అంద‌మైన ఫీల్ క్యారీ అయి స‌మ్మోహ‌నంగా అనిపిస్తుందంటున్నారు. మరొకొందరైతే సినిమా ఫ్రెష్ లుక్‌తో బాగుందని.. అయితే సెకండాఫ్ మరీ సాగదీసినట్లు ఉందంటూ పెదవి విరిస్తున్నారు. ప్రస్తుతం చిత్రానికి భిన్నాభిప్రాయాలను ట్వీట్స్ ద్వారా అందిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.