Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సారీ చెప్పిన సమంత

Category : movies

అక్కినేని సమంత , రాహుల్ రవీంద్రన్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా యూ టర్న్. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు సమంత డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ డబ్బింగ్‌పై అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె వాయిస్ అంతగా సూట్ అవలేదని.. పేలవంగా ఉందని టాక్ వినిపిస్తోంది.

ట్విటర్ ద్వారా ఓ అభిమాని డబ్బింగ్ విషయంలో కేర్ తీసుకోమని సలహా ఇచ్చారు. దీనికి సామ్ చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అయింది. ‘‘సమంత మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నా. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ డబ్బింగ్‌కు కూడా మంచి రివ్యూస్ వస్తాయని భావిస్తున్నా. యూ టర్న్ డబ్బింగ్ విషయంలో జాగ్రత్త తీసుకోండి’’ అని ట్వీట్ చేశారు. దీనికి సమంత ‘‘డబ్బింగ్‌ను సరి చేస్తున్నాం. దానికి సారీ’’ అని చెప్పింది. ఒకరు చెప్పిందాన్ని ఇంత పాజిటివ్‌గా రిసీవ్ చేసుకోవడమే కాకుండా సారీ కూడా చెప్పిన ఆమె వ్యక్తిత్వాన్ని చూసి అక్కినేని అభిమానులు ఫిదా అవుతున్నారు.