//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

"మజిలీ" చిత్ర బృందం పై సమంత ట్వీట్,పోస్ట్ . ..?

Category : movies

అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం ‘మ‌జిలీ’. ఇటీవలే ప్రేమికుల రోజు కానుకగా ఈ చిత్ర యూనిట్ టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన విషయం తెలిసిందే.

'నిన్నుకోరి' వంటి క్లాస్ లవ్ స్టోరీ తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడం టీజర్ తర్వాత ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో నాగ‌చైత‌న్య రెండు భిన్నమైన పాత్రల్లో నటిస్తుండగా.. స‌మంత ఇందులో మ‌ధ్య త‌ర‌గ‌తి గృహిణి పాత్రలో నటిస్తుంది. భ‌ర్తపై ఎంతో జాగ్రత్తగా, ప్రేమ‌గా ఉండే భార్య పాత్రలో కనిపించిన సమంత.. టీజర్‌తోనే అందరినీ ఆకర్షించేసింది‌.

ఈ సినిమా షూటింగ్ పూర్తయిందనీ .. ఏప్రిల్ 5వ తేదీన విడుదలవుతుందని సమంత ట్వీట్ చేసింది. ఈ సినిమాకి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవమనీ, ఇంత మంచి టీమ్ తో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందంటూ ..ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్క క్రాఫ్ట్ తో తమకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని . సినిమా టీమ్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ తన ఫీలింగ్ పంచుకుంది సమంత. గోపీసుందర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. పెళ్లి తరువాత సమంత .. చైతూ కలిసి చేసిన ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది. ఈ సినిమా హిట్ కొడితే అది ఈ జంటకి ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందనే చెప్పాలి.

Related News