//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సమంతను చూడడానికి వెళితే ఏమైందో తెలుసా...!

Category : movies

తెలుగు సినీ అభిమానులు తమ అభిమాన హీరోలను, హీరోయిన్ లను దేవుళ్లుగా చూస్తారు. వీరి అతి అభిమానం వల్ల చాల సార్లు అభిమానులు అలాగే నటులు కూడా ఇబ్బందిపడ్డారు. తమ అభిమాన హీరోహీరోయిన్ లను చూడడానికి, వారితో ఫోటో దిగడానికి ఎంతకైనా తెగిస్తుంటారు కొంతమంది. అలాచేసిన వారు ఆ నటుల బాడీ గాడ్స్ లేదా పోలిసుల చేత చావు దెబ్బలు తిన్న సందర్భాలు కూడా వున్నాయి.

అలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో జరిగింది. అసలు విష్యం ఏమిటంటే అనంతపురం లో ఒక మొబైల్ స్టోర్ ఓపెన్ చేయడానికి సమంత అక్కడకు వచ్చింది. సమంత వస్తుందన్న విషయం తెలుసుకున్న అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు.

ఆమె నడుస్తూ మొబైల్ షో రూమ్ లోకి పోతున్న తరుణం లో ఒక అభిమాని ఆమెను చూడాలని ఆత్రుతతో ఆమె వైపు దూసుకువచ్చాడు. ఏది గమనించిన అక్కడవున్న పోలీసులు అతనిని తీసుకోని పక్కకు వెళ్లి చితకబాదారు.తరువాత అక్కడ జరిగిన తోపులాటతో పోలీసులు స్వల్ఫ లాఠీ ఛార్జీ చేశారు. అనుకోని ఈ సంఘటనతో సమంత తొందరగా కార్యక్రమాన్ని ముగించుకొని అక్కడినుండి వెళ్ళిపోయింది,