//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాష్ట్రపతి ఏన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పట్ల సోనియా పట్టు !

Category : national editorial

మరో రెండు నెలల్లో జరుగనున్న రాష్త్ర పతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి సునాయాసంగా గెలుపొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నా, ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిని నిలబెట్టడం కోసం ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నాయి. ఆ విధంగా చేస్తే 2019 ఎన్నికల నాటికి బిజెపికి వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు నాంది కాగలదని భావిస్తున్నాయి. ఈ విషయమై ప్రతిపక్ష నాయకులు పరస్పరం పలు సమాలోచనలు జరుపుతున్నా అభ్యర్థి విషయంలో ఒక అవగాహనకు రాలేకపోతున్నారు. అందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ నాయకుడే ప్రతిపక్ష అభ్యర్థిగా ఉండాలని సోనియా గాంధీ పట్టుబట్టడమే కారణంగా తెలుస్తున్నది. చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీయే అభ్యర్థిని నిర్ణయిస్తుంది గదా అని సోనియా అంటున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం తమ నుండి అభ్యర్డుని ఎంపిక చేయాలని భావిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ కు అభ్యర్థిని వదిలి వేస్తే తర్వాత ప్రధాన మంత్రి అభ్యర్థి విషయంలో సహితం కాంగ్రెస్ పార్టీకి వదిలి వేయవలసి వస్తుందని వెనకడుగు వేస్తున్నాయి.

మే 1న ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు మధు లిమాయ జయంతి సందర్భంగా జరిగిన సభలో 13 పక్షాల నాయకులు పాల్గొనడం ద్వారా కాంగ్రెసేతర ప్రతిపక్షాలు సంఘీభావం ప్రకటించాయి.ఈ సందర్భంగా జె డి (యు) మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ పేరును తెరపైకి తీసుకువస్తున్నారు. ఆయన సోనియా గాంధీతో సహా ప్రతిపక్షాల నాయకులు అందరిని కలసి మద్దతు కోరుతున్నారు. వామపక్షాలు అయితే మాత్రం రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిని అభ్యర్థిగా ఎంపిక చేయాలనీ సూచిస్తున్నాయి. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి విషయంలో మమతా బెనెర్జీ, నవీన్ పట్నాయక్ ఇంకా తమ అభిప్రాయం వెల్లడించలేదు. అభ్యర్థి నిర్ణయంలో వారి మద్దతు కీలకం కానున్నది.