Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బాలీవుడ్ లో దుమ్ము దులుపుతున్న సల్మాన్ ఖాన్ "భరత్" కలెక్షన్స్....!

Category : movies

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో ఎప్పటికప్పుడు తనదైన మార్క్ చూపిస్తున్న హీరోల్లో ఒకరు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. తాజాగా ఈ కండల వీరుడు నటించిన తాజా చిత్రం భరత్. ఈ సినిమాలో సల్లు బాయ్ కి జోడీగా హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ నటించింది. ఇప్పటి వరకు వీరి కాంబినేషన్‌లో పలు చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో తాజగా రిలీజ్ వీరి కామీనేషన్ లో రిలీజ్ అయిన ‘భరత్’ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రంజాన్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం రెండు రోజుల్లోనే ఏకంగా 73 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా రిలీజైన మొదటి రోజు సల్మాన్ కెరీర్‌లోనే అత్యధికంగా 43 కోట్ల కలెక్షన్స్ సాధించగా...రెండో రోజు 30 కోట్ల కు పైగా వసూళ్లు సాధించింది. మొదటి రోజు ఓపనింగ్స్‌తో పోల్చితే రెండో రోజు కలెక్షన్స్ 25 శాతానికి పైగా తగ్గాయి.

ఈ వారాంతంలో ‘భరత్’ కలెక్షన్స్ మరింత పుంజుకోవచ్చని ట్రేడ్ పండితులు అంచనావేస్తున్నారు.బాలీవుడ్‌ సినిమా చరిత్రలో అత్యధిక మొదటి రోజు కలెక్షన్స్ సాధించిన నాలుగో చిత్రంగా "భరత్" సినిమా రికార్డులు సృష్టించింది...2019లో అత్యధిక ఫస్ట్‌డే కలెక్షన్స్ సాధించిన రెండో చిత్రంగా గుర్తింపు సాధించింది. 2019లో విడుదైన హాలీవుడ్ డబ్బింగ్ సినిమా "అవెంజర్స్ ఎండ్‌గేమ్" దాదాపు 53 కోట్ల కలెక్షన్స్‌తో అత్యధిక మొదటి రోజు కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. సల్మాన్ చిత్రాల్లో అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగానూ ‘భరత్’ గుర్తింపు సాధించింది. 2015 దిపావళికి విడుదలైన సల్మాన్ ఖాన్ చిత్రం ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ ఫస్ట్ డే కలెక్షన్స్ 40 కోట్ల రికార్డును ఈ చిత్రం అధిగమించింది.‘భరత్’ కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తుండడంతో తన ఫ్యాన్స్‌కు సల్మాన్ ఖాన్ తాజగా ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

Related News