//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మాజీ వ‌దిన‌ని.. అత‌నితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సల్మాన్

Category : movies

బాలీవుడ్ భామ‌ మలైకా అరోరా తెలుగు ప్రేక్ష‌కులు చాలా మందికి సుపరిచితమే. మున్ని బద్నామ్ పాటతో బాలీవుడ్‌ని ఒక ఊపు ఊపేసిన మలైక.. తెలుగులో ప‌వ‌న్ న‌టించిన గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంలో కెవ్వుకేక సాంగ్‌లో ఇర‌గ‌దీసింది. ఇక గ‌తంలో సల్మాన్‌కి వ‌దిన అయిన మ‌లైక‌.. స‌ల్మాన్ అన్నతో విడిపోయిన విషయం తెలిసిందే. అయితే అతనితో విడిపోకముందు నుండే ఆమె అర్జున్ కపూర్‌తో అఫైర్ వార్త బాలీవుడ్ మొత్తం హాల్ చల్ చేసాయి. కేవలం అర్జున్ వల్లే విడిపోయింది బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.

అయితే తాజా మ్యాట‌ర్ ఏంటంటే.. వీళ్లిద్దరినీ సల్మాన్ ఒకసారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడని.. అర్జున్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడని కూడా వార్తలొచ్చాయి. అయితే సల్మాన్‌తో గొడవలు పెట్టుకుంటే చాలా ఇబ్బందులుంటాయన్నభయంతో అర్జున్ మలైకాకు దూరంగా ఉంటున్నాడట. అంతే కాక సల్మాన్‌తో రాజీ కోసం అతను ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇటీవల సల్మాన్ కృష్ణ జింకల కేసులో జైలుకు వెళ్లినపుడు అతడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బాధ పడ్డాడట. సల్మాన్ ఖాన్‌తో దగ్గరయ్యేందుకు నానా కష్టాలు పడుతున్నట్టు సమాచారం. మలైకాతో ఎఫైర్ విషయంలో లెంపలేసుకుని అర్జున్ సల్మాన్‌తో రాజీకి ప్రయత్నిస్తున్నట్లుగా ఒక పత్రిక కథనం ఇచ్చింది.