ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధుపై సైనా నెహ్వాల్ సంచలన విజయం నమోదు చేసింది. నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో 21-17, 27-25 పాయింట్ల తేడాతో సైనా నెహ్వాల్ విజయం సాధించింది. ఈ టైటిల్ ను సైనా అందుకోవడం ఇది మూడోసారి. వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకిగ్స్ లో సైనా 11వ స్థానంలో ఉండగా… సింధు 2వ స్థానంలో ఉంది.