//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శైలజారెడ్డి అల్లుడు నుండి బయటికొచ్చిన శివగామి....!

Category : movies

శివగామి ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనం. రమ్యకృష్ణ ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ లో బిజీగా ఉంది. ఒక్క బాహుబలి తో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ పీక్ లెవెల్ కి వెళ్ళిపోయింది.

బాహుబలి ముందు వరకు రమ్యకృష్ణ అంటే నరసింహ సినిమాలో ఆమె పోషించిన నీలాంబరి పాత్రనే అందరికి గుర్తుకువచ్చేది. కానీ బాహుబలి తరువాత అందరూ ఆమెని శివగామిగా గుర్తుపెట్టుకున్నారు, అంతలా ఆ పాత్ర అందరిని మెస్మరైజ్ చేసింది. ఆమె చేసిన అన్ని సినిమాల్లో నీలాంబరి, శివగామి పాత్రలు తెలుగు ప్రేక్షకులకి ఎప్పటికి గుర్తుండిపోతాయి.

ఇప్పుడు అలాంటి పాత్రనే మళ్ళీ చేస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె తెలుగు లో నాగ చైతన్య - మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న శైలజా రెడ్డి అల్లుడు చిత్రం లో టైటిల్ రోల్ పోషిస్తుంది.

ఇటీవలే చిత్ర సెట్ లో జాయిన్ అయిన రమ్యకృష్ణ, తాజాగా నిన్నటి తో తన పాత్రకు సంబందించిన షూటింగ్ ను పూర్తి చేసిందట. ఈమె పాత్రే సినిమాకు హైలైట్ గా ఉండబోతుందని చిత్రనిర్మాతలు తెలిపారు. శైలజా రెడ్డిగా రమ్యకృష్ణ, ఆమె కూతురుగా అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 31 న రిలీజ్ చేయాలన్నది నిర్మాతల ఆలోచనగా ఉన్నట్టు సమాచారం.