//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శైలజారెడ్డి అల్లుడు సెన్సార్ పూర్తీ ...!

Category : movies

అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శైలజారెడ్డి అల్లుడు. ఎస్.రాధాకృష్ణ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో మరో సారి బాహుబలి శివగామి తన విశ్వరూపాన్ని ప్రదర్శించబోతుందని చిత్ర యూనిట్ చెప్తున్నారు .

ఈ సినిమా వినాయక చవితి కానుకగా ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర పనులు, ప్రమోషన్స్ నిర్వహించుకుంటూ బిజీబిజీగా ఉంది.ఆదివారం ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి నాగార్జున, నాని అతిథులుగా హాజరయ్యారు. తాజాగా శైలజారెడ్డి అల్లుడు సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.

ఈ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. గోపీ సుందర్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ కానుంది.