//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సాయిప‌ల్ల‌వి సీరియ‌స్ వార్నింగ్‌..!

Category : movies

టాలెంటెడ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ సాయిప‌ల్ల‌వి ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో మూడు సినిమాలు చేస్తే.. హార్ర‌ర్ చిత్రం క‌ణం మిన‌హాయిస్తే ఫిదా, ఎంసీఏలో ఈ అమ్మ‌డిదే డామినేష‌న్‌. సాధార‌ణంగా టీజ‌ర్‌లో హీరోయిజాన్ని హైలెట్ చేస్తారు. స్టార్ హీరో సినిమాలో అయితే, ఒక్కోసారి హీరోయిన్ సింగిల్ ఫ్రేమ్‌లో కూడా క‌నిపించ‌దు.

కానీ, ఫిదా టీజ‌ర్ ఈ అమ్మ‌డుతోనే మొద‌లైంది. తెలంగాణ యాసలో ఇచ్చిన వార్నింగ్‌తో అందరి దృష్టిని త‌న‌వైపు తిప్పుకుంది. ఎంసీఏ టీజ‌ర్ నానితో మొద‌లైన‌ప్ప‌టికీ సాయిప‌ల్ల‌వి రాక‌తో క‌థ‌ను త‌న‌వైపు తిప్పుకుంది. అయితే, ఎంసీఏ మాదిరినే.. ప‌డి ప‌డి లేచే మ‌న‌సు చిత్రంలోనూ డ్యాషింగ్ రోల్ పోషించింది సాయిప‌ల్ల‌వి.

సైట్‌కొడుతున్న హీరో ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఏం లైన్ కొడుతున్నావా... అంటూ అడిగే డైరెక్ట్ రోల్‌ను పోషిస్తుంది సాయిప‌ల్ల‌వి. సినిమాకు హైప్ క్రియేట్ చేయ‌డానికి సాయిప‌ల్ల‌వి డామినేష‌న్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని సినీ విశ్లేష‌కులు భావిస్తున్నారు.