//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహేష్ బాబు సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన ...రౌడీ బేబీ

Category : movies

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన లక్కీ ఛాన్స్ కొట్టేసిన రౌడీ బేబీ .ఇప్పటికే వరుస పెట్టి తెలుగు,తమిళ్,మలయాళం వంటి అన్ని సౌత్ ఇండియన్ మూవీస్ లో..... నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న భామ సాయి పల్లవి. కథ, కథనాల్లో కొత్తదనం ఉంటేనే గాని ఏ ప్రాజెక్టుకైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది సాయిపల్లవి. అందువల్లనే ఆమె ఖాతాలో వైవిధ్యభరితమైన సినిమాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ లెక్కనే తాజాగా ఈ అమ్మడు మహేశ్ బాబు 26వ సినిమాలో నటించే అవకాశాన్నీ దక్కించుకున్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో చెక్కర్లు కొడుతుంది.

ప్రస్తుతం మహేశ్ బాబు తన 25వ సినిమాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' చేస్తున్నాడు. ఈ సినిమా అనంతరం మహేష్ బాబు తన 26వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా సాయిపల్లవిని తీసుకోవాలనే ఉద్దేశంతో అనిల్ రావిపూడి ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అనిల్ 'ఎఫ్ -2' వంటి క్రేజీ బ్లాక్ బస్టర్ హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు.ఆ జోష్ లోనే మహేష్ బాబు తో సినిమా ఒప్పించాడు. ఇక హీరోయిన్స్ విషయం ఫైనల్ చేయడం కోసమే అందరితో సంప్రదింపులు జరుపుతున్నాడు.

అందులో భాగంగానే ఈ సినిమా లైన్ వినిపించడానికి అనిల్ రావిపూడి చెన్నైకి వెళ్లినట్టు సమాచారం. అంతే కాకుండా ఈ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ కూడా సాయిపల్లవిని కలిసి స్టోరీ లైన్ చెప్పెనట్టు అందుకు సాయి పల్లవి కూడా పాజిటివ్ గా ఉన్నట్టు తెలుస్తుంది.ఈ సినిమా కు సంగీత దర్శకుడిగా డీఎస్పీ నే ఖరారు చేసినట్టు ..మరో సారి 'ఎఫ్ -2' కామినేషన్ రిపీట్ చేయాలనీ చూస్తునట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమాకూడా త్వరలోనే సెట్స్ పైకి వేళ్ళ నున్నట్టు ముఖ్య సమాచారం.

Related News