//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పవన్ వస్తే ఎలా సమాధానం చెప్పాలో తెలుసు

Category : national

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వస్తే ఆయన చేసే వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నట్టు సిని నటుడు, బాగేపల్లి బిజెపి అభ్యర్ధి సాయి కుమార్ తెలిపారు. వివరాల్లోకి వెళితే ఆయన ఎన్నికల సందర్భంగా ఒక మీడియా ఛానల్ కి ప్రత్యేక ఇంటర్వ్యు ఇచ్చారు. ఈ సందర్భంగా సాయి కుమార్ పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. మిగతా పార్టీలు సినీతారలను రంగంలోకి దింపుతున్నాయి? ఎలా తట్టుకుంటారు?అనే ప్రశ్నకు గాను సమాధానంగా...

సినీతారల తళుకులకు ఓట్లు పడవు. వారి ప్రచారానికి వచ్చే జనమంతా వారికే ఓటేస్తారని చెప్పలేం. ప్రముఖులు ఎవరొచ్చినా ప్రజలు సెల్ఫీలకు ఆసక్తి కనబరుస్తారు? సెల్ఫీ దిగిన వారంతా ఓటేయరు. ప్రజల్లోకి నేరుగా చొచ్చుకుపోయే అతిపెద్ద మీడియా సినిమానే. అయితే, దాంతో ఓట్లు పడవు. నేనూ స్టార్‌నే. కానీ, ఇంటింటికీ తిరిగితేనే ఓటర్లకు మనపై భరోసా ఉంటుందని నమ్ముతారు. తారలతో రోడ్‌షోలతో ఫలితం ఉండదన్నారు. అలాగే కర్ణాటకలో బిజెపి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందని విశ్వాసం వ్యక్త౦ చేసారు.