//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రూట్ మార్చిన సాయి ధరమ్ తేజ్.....!

Category : movies

మెగా వారసుడిగా తెలుగు తెరకు పరిచయమైన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.కెరీర్ మొదట్లో వరస విజయాలు అందుకున్న ఈ కుర్ర హీరో ఇటీవల కాలంలో కాస్త వెనకపడ్డాడు అనిచెప్పాలి.రొటీన్ కథలతో అభిమానులని నిరాశపరుస్తూ తేజ్ కొంచం వెనకపడ్డాడు అనే చెప్పాలి.

ఇప్పుడు తాజాగ తేజ్ రూట్ మార్చిప్రేమకథను ఒప్పుకున్నాడు అన్న టాక్ వినిపిస్తుంది.ప్రేమకథలలో దిట్ట ఐన కరుణాకరన్ తో తేజ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చేస్తున్నాడు.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ‘దేవుడు వరమందిస్తే’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. 2001లో రోహిత్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘6టీన్స్‌’ సినిమాలోని సూపర్‌ హిట్ పాట పల్లవి దేవుడు వరమందిస్తే.

ఇన్నేళ్ల తరువాత ఆ పల్లవిని టైటిల్‌గా సెలెక్ట్ చేసుకున్నాడు సాయిధరమ్‌ తేజ్‌. అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతమందిస్తున్నాడు.