Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సాహోలో ఒక్క ఫైట్ కు 90కోట్లు..

Category : movies

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బాహుబ‌లి త‌ర్వాత చేస్తున్న సినిమా సాహో. ఈ చిత్రానికి సుజిత్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా యూవి క్రియేష‌న్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌భాస్ 5సంవ‌త్స‌రాలు బాహుబ‌లి సినిమాతోనే బిజిగా గ‌డిపేసాడు. ప్ర‌స్తుతం సాహో చిత్రం తో ఘూటింగ్ లో బిజిగా గ‌డిపేస్తున్నాడు. భారీ అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కుతున్న ఈమూవీ పై పెద్ద ఎత్తున ఎక్ప్టెస్టేష‌న్ ఉన్నాయి. 5సంవ‌త్సారాలు ఒకే గెట‌ప్ లో చూసి అభిమానులు.. ఇప్పుడు ప్ర‌భాస్ ను కొత్త లుక్ లో చూసేందుకు ఆస‌క్తిగా ఉన్నారు.

అయితే ఈ సినిమా ఘూటింగ్ ప్ర‌స్తుతం దుబాయ్ లో జ‌రుగుతుంది. అక్క‌డ ప్ర‌భాస్ పై ఓ భారీ ఫైట్ ను తెర‌కెక్కిస్తున్నారు. ఈ ఫైట్ కో్సం హాలీవుడ్ ఫైట్ మాస్ట‌ర్లు ప‌నిచేస్తున్నారు. దుబాయ్ రోడ్ల‌పై ఛేజింగ్ చిత్రాల‌ను చిత్ర‌క‌రిస్తున్నారు సాహో చిత్ర యూనిట్. మాములుగా ఏదైనా సినిమాను 60 నుంచి 80రోజులు చిత్రిక‌రిస్తారు. కానీ ప్ర‌భాస్ న‌టిస్తున్న సాహో చిత్రానికి ఒక్క ఫైట్ కోస‌మే 60రోజులు ఘూటింగ్ చేస్తున్నారంట‌. ఆ ఒక్క ఫైట్ కో్సం దాదాపు 90కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారంట‌.

ఈఫైట్ సినిమాలో చాలా కీల‌క‌మైన స‌న్నివేశం కావ‌డంతో..అంత‌ర్జాతీయ స్ధాయిలో ఉండాల‌న్న ఆలోచ‌న‌తో ఈ స్ధాయిలో ఖ‌ర్చు పెడుతున్నామ‌న్నారు యూవీ క్రియేష‌న్స్ అధినేత‌లు. ఈ సినిమాను దాదాపు 300కోట్ల బడ్జెట్ తో తెర‌కెక్కించున్నారు. తెలుగు హిందీలో ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు.

Related News