//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నదుల కోసం సద్గురు వాసుదేవ్ దేశ వ్యాప్త ర్యాలీ

Category : national

ఎన్నో వేల సంవత్సరాలుగా మానవ మనుగడకు జీవనాధారమైన  నదులు మనముందే అంతరించి పోతున్నాయి. వాటి పునరుద్ధరణ కోసం ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ "నదుల కోసం ర్యాలీ" చేపట్టారు.నదులు ఉమ్మడి జాబితాలో ఉండడంతో కేంద్రం కేవలం విధానాలు రూపొందించ గలదు. అమలు పరచవలసింది రాష్ట్ర ప్రభుత్వాలే. 

అందుకనే నదుల పరిరక్షణ గురించి ప్రజలలో చైతన్యం తీసుకు రావడం కోసం, తద్వారా ప్రభుత్వాలలో విధానపరమైన కదలిక వచ్చే విధంగా చేయడం కోసం సద్గురు సెప్టెంబర్ 1 నుండి మహోద్యమం చేపట్టారు.   సెప్టెంబర్ 3 నుండి 16 రాష్ట్రాల ద్వారా  7 వేల కి మీ మేరకు `నదుల కోసం ర్యాలీ' జరుపనున్నారు. 

"నేను వ్యక్తిగతంగా కోయింబత్తూర్ నుండి హిమాలయాల వరకు జరిగే ఈ ర్యాలీ లో పాల్గొంటున్నాను. దారిలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అందులో పాల్గొంటామని హామీ ఇచ్చారు. మేము వెళ్లే ప్రతి నగరంలో ఒక భారీ ప్రదర్శన, బహిరంగ సభ జరుగుతుంది. తద్వారా దేశ వ్యాప్తంగా గొప్ప చైతన్యం తీసుకు రావాలి అనుకొంటున్నాను" అని సద్గురు చెప్పారు. 

తలసరి లభ్యమవుతున్న నీరు 1947తో పోల్చు కొంటె నేడు 75 శాతం తక్కువగా ఉన్నది. దేశంలో 25 శాతం ఎడారిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మన ముందే సంవత్సరం అంతా ప్రవహించే జీవ నదులు అనేకం సీజనల్ గా మాత్రమే ప్రవహిస్తున్నాయి. అనేక చిన్న చిన్న నదులు అంతరించి పోతున్నాయి. పరిస్థితులు ఈ విధంగానే ఉంటె 2030 నాటికి నదీ జలాలు సగానికి సగం పడిపోనున్నాయి. 

ఈ విషయమై మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం సెప్టెంబర్ 1 న ప్రారంభించారు. దాదాపుగా అన్ని మీడియా సంస్థలు స్వచ్ఛందంగా ప్రచారం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అనేక మంది సినీ తారలు, క్రీడాకారులు, ఇతర ప్రముఖులు ఈ ర్యాలీ గురించి ట్వీట్ లు ఇచ్చారు. పాఠశాల బాలల నుండి సినీ తరాల వరకు, సాధారణ రైతుల నుండి దేశంలో ప్రముఖ నాయకుల వరకు ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు. 

ఈ ఉద్యమంలో భాగంగా సెప్టెంబర్ 1 న ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు దేశ వ్యాప్తంగా ప్రతి చోట వందలాది మంది కూడలి ప్రదేశాలలో కేవలం  నిలబడి "నదుల కోసం ర్యాలీ" అని బ్లూ రంగులో ఉన్న ప్లే కార్డు ను పట్టుకొని సంఘీభావం తెలిపారు. 

"ఇది ఆందోళన కాదు. ఆందోళలన అంటే ఎప్పుడూ  ఎవ్వరో ఒకరికి వ్యతిరేకంగా ఉంటుంది. ప్రతివారు నీటిని ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి దీనికి ఎవ్వరు వ్యతిరేకం కాదు" అంటూ మొత్తం దేశ ప్రజలకు సంబంధించిన అంశం ఇదని  సద్గురు వాసుదేవ్ పేర్కొన్నారు. ఈ ఉద్యమానికి మద్దతుగా మిస్సేడ్ కాల్ ను "8000980009" నెంబర్ కు ఇవ్వమని కోరారు. 10 నుండి 30 కోట్ల మంది వరకు ప్రజలు ఆ విధంగా ఇవ్వాలని చెప్పారు.

తద్వారా నదుల పునరుద్ధరణ విధానానికి ప్రజలు తమ మద్దతు తెలుపాలని అన్నారు. భారీ ఆర్ధిక వనరులు అవసరమైన ఇటువంటి విధానాలను ప్రభుత్వాలు చేపట్టాలి అంటే, తద్వారా కోట్లాది మంది ప్రజల జీవనాలలో మార్పులు తీసుకు రావాలి అంటే ప్రతిదీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. నదులు అన్నింటిని పునరుద్ధరించాలి అంటే 8 నుండి 15 ఏళ్ళ సమయం పడుతుందని, కనీసం 20 నుండి 25 ఏళ్లపాటు కృషి చేసినా నదుల ప్రవాహ వేగం 25 శాతం మేరకు పెరుగుతుందని సద్గురు చెప్పారు.

భారత్ లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వ పదవీకాలం ఐదేళ్లే కావడంతో, నదుల పునరుద్దరణకు దీర్ఘకాల ప్రణాళిక అవసరం ఉంది. తమ భవిష్యత్ లను కాపాడటం కోసం దీర్ఘకాలిక ప్రణాళిక చేయాలని ప్రభుత్వాలపై ప్రజలు వత్తిడి తీసుకు రావాలని ఆయన కోరారు. "మన సంస్కృతి కోసం, మన నదుల కోసం నిలబడండి" అంటూ ప్రజలకు జగ్గీ వాసుదేవ్ పిలుపిచ్చారు. 

* "8000980009" నెంబర్ కు మీరు మిస్సేడ్ కాల్ ఇవ్వండి.

Related News