భారత క్రికెట్ జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడిన అక్కడ జాతీయ పతాకంతోనూ, ముఖానికి పతాక రంగులతో కనిపిస్తూ సందడి చేసే వ్యక్తి గురించి అందరికి తెలిసిన విషయమే. బ్లాస్టర్ సచిన్ తెంద్కులర్ వీరాభిమాని సుధీర్ కుమార్ చౌదరి, సచిన్ రిటైరైన తర్వాత కూడా సుధీర్ భారత్ ఆడే మ్యాచ్‌ల్లో పాల్గొని ఆటగాళ్లను, అభిమానులను ఉత్సాహపరుస్తూనే ఉన్నాడు. కానీ చాంపియన్స్ ట్రోఫి కోసం వెళ్లటానికి అతనికి వీసా రాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టుతో కలిసి సుధీర్ ఇంగ్లాండ్ వెళ్లేందుకు దరఖాస్తు చేసుకోగా వీసా దక్కలేదు . సుధీర్‌కు వీసా దక్కకపోవడంపై సచిన్ స్పందించాడు. సుధీర్‌కు వీసా ఇవ్వాలని కోరుతూ లేఖ రాశాడు. ‘భారత జట్టుకు సుధీర్ వెలకట్టలేని మద్దతుదారుడని, అతను ఇంగ్లాండ్ వెళ్లేందుకు వీసా మంజూరు చేస్తారు’ అని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.