//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సచిన్ ని ఆశ్చర్యపరిచిన ఆఫ్ఘన్ క్రికెటర్

Category : sports

రషీద్ ఖాన్” ఐపియల్ లో హైదరాబాద్ జట్టుకి ఈ ఆటగాడు ఒక వరం. ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన 19 ఏళ్ళ ఈ ఆటగాడు స్టార్ ఆటగాళ్ళు కూడా కుళ్ళుకునే స్థాయిలో ప్రదర్శన చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచాడు. క్వాలిఫైయర్ 1 లో చెన్నై చేతిలో ఓడిపోయినా రెండో క్వాలిఫైయర్ లో విజయం సాధించి నిలబడింది అంటే దానికి ప్రధాన కారణం రషీద్ ఖాన్ ప్రదర్శనే. అన్ని రంగాల్లో రాణించిన ఈ ఆటగాడు 10 బంతుల్లో 4 సిక్సులు, రెండు ఫోర్లు బాది 34 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు.

ఈ నేపథ్యంలో రషీద్‌పై పలువురు క్రికెటర్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రషీద్‌ని అభినందిస్తూ.. ట్వీట్ చేశారు. ‘‘ఇంతకాలం రషీద్ మంచి బౌలర్ అనే అనుకున్నాను. కానీ ఇప్పుడు అతను ప్రపంచంలోనే ఈ ఫార్మాట్‌లో అత్యుత్తమమైన స్పిన్నర్ అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. గుర్తుంచుకోండి.. అతని గొప్ప బ్యాటింగ్ ప్రతిభ కూడా ఉంది. గ్రేట్ గాయ్’’ అని సచిన్

Related News