//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రపంచకప్ టీమ్ ఇండియాకే : సచిన్

Category : sports

భారత దేశంలోనే కాదు యావత్ ప్రపంచం మొత్తం కొనియాడే స్టార్ క్రికెట్ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్. చిన్నతనంలోనే క్రికెట్ రంగంలోకి అడుగు పెట్టి మహామహ బౌలర్లను బెంబేలెత్తించాడు. ప్రస్తుతం క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న సచిన్ తాజాగా ఈసారి ప్రపంచకప్‌ భారత్‌కే రాబోతుందని జోస్యం చెప్పాడు. మే 30 నుండి జరిగే ఈ ప్రపంచకప్‌ పూర్తి వేసవిలో జరగనుంది.

ఈ ఎండల ప్రభావం ఎక్కువగా పిచ్ లపై ఉంటుందని..అవి ఫ్లాట్ గా మారే అవకాశం ఉందని..అలాంటి పిచ్ లపై బ్యాటింగ్ చాలా బాగా చేయవొచ్చని అన్నారు. గతంలో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. పైగా ఇంగ్లాండ్‌లో ఉండే పిచ్‌లన్నీ ఫ్లాట్‌గా ఉంటాయన్నారు. ఒకవేళ వాతావరణ ప్రభావం వల్ల ఏమైనా తారు మారు అయినా..మన భారత బ్యాట్ మెన్స్ చాలా మెలకువలు తెలిసిన వారని..చక్కగా రాణిస్తారని అన్నారు. కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌పాండ్యతో పాటు ఇతర ఆటగాళ్లు కూడా మంచి ఫాంలో ఉన్నారన్నారు. వీరంతా ఐపీఎల్‌లో బాగా రాణిస్తున్నారు. ఈసారి ప్రపంచకప్‌లో భారత్‌ ఫేవరెట్‌ జట్టు అనడంలో సందేహం లేదుగా అని అన్నాడు సచిన్‌.