ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అతనొక మహా శిఖరం.క్రికెట్ ఆడే వారికీ ,చూసే వారికి ఆయనొక గాడ్ .అతడే సచిన్ రమేష్ టెండూల్కర్ ఈ విషయం అందరికి తెలిసిందే .... సచిన్ ఇప్పటి వరకు క్రికెట్ లో సాధించిన విజయాలు,రికార్స్,రివార్డ్స్ అన్ని ఇన్ని కావు. అలాంటి రికార్డ్స్ ని ఇప్పటివరకు ఎవరు టచ్ కూడా చేయలేరు ...భవిషత్తులో ఆ ఘనత సాధించే వారు ఉంటారని అనుకోవడము కూడా అత్యాశే అవుతుంది. అలాంటి సచిన్ టెండూల్కర్ సాధించిన కొన్ని రికార్డ్స్ చూస్తే ....
ఇప్పటివరకు సచిన్ ఆరు వరల్డ్ కప్ టోర్నమెంట్స్ లో ఆడడం జరిగింది.1992-2011 వరకు జరిగిన అన్ని వరల్డ్ కప్ మ్యాచుల్లో పాలుపంచుకోవడం జరిగింది.వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు, అత్యధిక 50+ స్కోర్లు కూడా ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్నాయి . సచిన్ 44 ప్రపంచకప్ ఇన్నింగ్స్‌ల్లో 2277 పరుగులు సాధించాడు. ఇందులో సగటు 56.94. ఇప్పటివరకు క్రికెట్ వరల్డ్‌కప్‌లో అత్యధికంగా పరుగులు సాధించిన క్రికటర్ సచినే. వీటిలో 6 సెంచరీలు కాగా 15 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు (21) కలిగివున్న ఆటగాడు కూడా సచిన్ ఒక్కడే. అధిక పరుగులతో పాటు వరల్డ్ కప్ మ్యాచుల్లో 44 ఇన్నింగ్స్ ల్లో కలిపి 200 లకు పైగా ఫోర్ల్ బాదిన ఏకైక క్రికెటర్ సచిన్.ఆయన తరువాత స్థానంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రీకి పాంటింగ్ ( 96) ఫోర్ల తో ఉన్నాడు. ఇప్పట్లో ఈ రికార్డును బ్రేక్ చెయ్యడం దాదాపు అసాధ్యమే...
ఇప్పటివరకు భారత్ రెండు ప్రపంచ కప్స్ గెలవడం జరిగింది. అందులోకూడా అరుదైన రెండు రికార్డ్స్ ఉన్నాయి. ఈ రెండు ఫార్మాట్స్ అనగా : 60 ఓవర్లు, 50 ఓవర్లలో ఫార్మాట్లలో ప్రపంచకప్ గెలిచిన ఒకే ఒక్క జట్టు టీమిండియా. ప్రపంచకప్‌లో రెండు వేర్వేరు ఫార్మాట్లలో (60, 50 ఓవర్ల ఫార్మాట్లో) గెలిచిన ఏకైక జట్టుగా టీమ్ ఇండియా స్థానం సంపాదించుకుంది. 1983లో కపిల్ సారథ్యంలో వెస్టిండీస్‌పైన 60 ఓవర్ల ఫార్మాట్లో టైటిల్ గెలిచిన భారత జట్టు, 2011లో మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీలో 50 ఓవర్ల ఫార్మాట్లో వరల్డ్ కప్ సాధించింది. 1987 నుంచి 50 ఓవర్ల ఫార్మాట్ అమలులో ఉంది..ఈ రకమైన కొన్ని రికార్డ్స్ భారత ఖాతాలో ఉండడం ఎంతో విశేషం.