స్నేహితులకు మనం స్థోమతను బట్టి కానుకలు ఇస్తుంటాం. కానీ కొందరు సెలబ్రిటీలు తమకు బాగా ప్రత్యేకమైన స్నేహితులకు రూ. కోట్ల రూపాయలు ఖరీదు చేసే గిఫ్ట్ లు కూడా ఇస్తుంటారు. ఏంటి నమ్మరా...నమ్మాలి మరి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వీరేంద్ర సెహ్వాగ్ కు ఇచ్చిన గిఫ్ట్ చూస్తే ఎవరికైనా షాక్ అవ్వలిసిందే. బీఎండబ్ల్యూ 730ఎల్ డీ కారును సచిన్ సెహ్వాగ్ కు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ కారు విలువ రూ. 1.14కోట్లు. సచిన్ తనకు బహుమతిగా ఇచ్చిన కారును ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సెహ్వాగ్ ఆయనకు థాంక్స్ చెప్పాడు.
సచిన్, సెహ్వాగ్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరూ భారత జట్టుకు ఆడే సమయంలో ఏర్పడ్డ పరిచయం క్రమేణా విడదీయలేని స్నేహానికి దారితీసింది. జట్టు ఓపెనర్లుగా వారిద్దరూ భారత్ కు చిరస్మరణీయ విజయాలు అందించారు. సెహ్వాగ్ అయితే సచిన్ ను క్రికెట్ దేవుడిగా ఆరాధిస్తాడు. సచిన్ స్ఫూర్తితోనే తాను క్రికెట్ లోకి వచ్చానని ఎన్నో సందర్భాల్లో చెప్పాడు సెహ్వాగ్. ఢిల్లీలోని నజఫ్ గఢ్ ప్రాంతానికి చెందిన సెహ్వాగ్ ను చిన్నతనంలో అందరూ నజఫ్ గఢ్ టెండూల్కర్ అని పిలిచేవారట.