//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సంచలన నిర్ణయం తీసుకున్న శబరి ఆలయ బోర్డు !

Category : national

కేర‌ళ‌లోని శ‌బ‌రిమ‌లై అయ్య‌ప్ప స‌న్నిధానంలోకి 10 నుంచి 50 ఏళ్ల వ‌య‌సున్న మ‌హిళ‌ల ప్ర‌వేశంపై నిషేధం ఉన్న సంగ‌తి తెలిసిందే.

అయితే గ‌త కొన్ని నెల‌లుగా అక్ర‌మంగా లోప‌లికి ప్ర‌వేశించ‌డానికి కొంత‌మంది ప్ర‌య‌త్నిస్తున్న నేపథ్యంలో వారిని అరిక‌ట్ట‌డానికి ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఓ కొత్త నిబంధ‌న‌ను తీసుకువ‌చ్చింది. దీని ప్ర‌కారం లోప‌లికి వెళ్లాల‌నుకున్న బాలిక‌లు, మ‌హిళ‌లు త‌మ వ‌య‌సును ధ్రువీక‌రించాల్సి ఉంటుంది. మహిళా భక్తుల వయసు ధ్రువీకరణ తప్పనిసరి చేస్తూ నిర్ణయించింది.

వాస్తవానికి 12 నుంచి 50 ఏళ్లలోపు వయసు ఉన్న మహిళా భక్తులకు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించకుండా నిషేధం ఉంది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా కొందరు భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు. స్వామి దర్శనం కోసం వచ్చే మహిళా భక్తులు తమ వయసును నిర్ధారించే ఏదైనా గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ట్రావెన్ కోర్ దేవస్వోమ్ బోర్డు తెలిపింది.

నైష్ఠిక బ్రహ్మచారి అయిన అయ్య‌ప్ప స్వామి స‌న్నిధానంలోకి రుతుక్ర‌మంలో ఉన్న మ‌హిళ‌లు ప్ర‌వేశించ‌డానికి వీల్లేదు. అలాగే ఈ జ‌న‌వ‌రి 14 వ‌ర‌కు అయ్య‌ప్ప భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండ‌బోతున్న కార‌ణంగా, ధ్రువీక‌ర‌ణ ప‌త్రం స‌మ‌ర్పించ‌డమనే నిబంధ‌న వ‌ల్ల చెకింగ్ ప‌నులు సుల‌భ‌త‌రం అయ్యే అవ‌కాశం ఉంది. పంపా కొండల వద్దే మహిళా పోలీసులు, సిబ్బంది సాయంతో వయసు పరిశీలన జరుపుతున్నట్టు వెల్లడించింది. చెకింగ్ స‌మ‌యంలో వ‌య‌సు ధ్రువీక‌రించే ఆధార్‌, ఎన్నిక‌ల గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ వంటి ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాలని బోర్డు అధ్య‌క్షుడు ఎ. ప‌ద్మ‌కుమార్ తెలిపారు.