Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సాక్ష్యం మూవీ రివ్యూ .....!

Category : movies

సాక్ష్యం....బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన తాజా చిత్రం. అభిషేక్ పిక్చ‌ర్స్‌ బ్యానర్ పై తెరకెక్కించిన ఈ చిత్రం ఈ రోజు సినీ అభిమానుల ముందుకు వచ్చింది. ఎలా ఉందొ మీరు ఒక లుక్ వేయండి......

న‌టీన‌టులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే, శరత్ కుమార్, మీనా, జగపతిబాబు, రవికిషన్, అశుతోష్ రానా, మధు గురు స్వామి, జయ ప్రకాష్, పవిత్ర లోకేష్, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు......డైరెక్టర్: శ్రీవాసు, నిర్మాత: అబిషేక్ నామ, మ్యూజిక్ డైరెక్టర్ : హర్షవర్ధన్ రామేశ్వరన్, కమెరామెన్: ఆర్థర్ ఏ విల్సన్....

టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పుడిపుడే హీరో లు కొత్తదనం వైపు అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు అయితే కేవలం హీరోయిజం చూపించే సినిమాలు మాత్రమే చేసేవారు, కానీ కాలక్రమేణా అందులో మార్పు వచ్చింది. హీరోలంద‌రూ ఇప్పుడు కొత్త త‌ర‌హా సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. సాక్ష్యం సృష్టిలో జ‌రిగేదానికి నాలుగు దిక్కులే కాదు.. ప్ర‌కృతి కూడా సాక్ష్యం. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌కృతే ప్ర‌క్షాళ‌న చేస్తుంద‌నే కాన్సెప్ట్‌తో రూపొందిన సాక్ష్యం ట్రైల‌ర్, మేకింగ్ వేల్యూస్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. మ‌రి ఈ అంచ‌నాల‌ను సినిమా అందుకుందా? లేదా అని తెలుసుకోవాలంటే క‌థేంటో చూద్దాం..

క‌థ:

స్వ‌స్తిక్ పురం గ్రామంలోని రాజుగారు(శ‌ర‌త్‌కుమార్‌) పేద ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండే వ్య‌క్తి. అదే ప్రాంతంలో ఉండే మున‌స్వామి అత‌ని త‌మ్ముళ్లు అక్ర‌మాల‌కు పాల్ప‌డుతుంటారు. వారికి ఎదురు తిరిగిన రాజుగారిని, అత‌ని కుటుంబాన్ని దారుణంగా చంపేస్తారు. అయితే రాజుగారికి పుట్టిన కొడుకుని ఎద్దు కాపాడ‌టంతో త‌ప్పించుకుంటాడు. కాశీ చేరిన ఆ శిశువుని శివ ప్ర‌కాశ్‌(జ‌య‌ప్ర‌కాశ్‌) చెంత‌కు చేరుతాడు. పిల్ల‌లు లేని శివ ప్ర‌కాశ్ ఆ పిల్లాడికి విశ్వ‌జ్ఞ( బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌) అనే పేరు పెట్టి పెంచి పెద్ద చేస్తాడు.

అదే స‌మ‌యంలో హైద‌రాబాద్‌లోని సౌంద‌ర్య తండ్రి మున‌స్వామి ఆక్ర‌మాల‌కు అడ్డుప‌డుతుంటాడు. మున‌స్వామికి వ్య‌తిరేకంగా కొన్ని సాక్ష్యాల‌ను సేక‌రిస్తుంటాడు. మున‌స్వామి త‌మ్ముడు వీరాస్వామి(ర‌వికిష‌న్‌) సౌంద‌ర్య‌ను చంపేయాల‌నుకుంటాడు. కానీ ప్ర‌కృతి కార‌ణంగా చ‌నిపోతాడు. దానికి విశ్వ ప‌రోక్షంగా కార‌ణ‌మ‌వుతాడు. అలాగే మున‌స్వామి ఇద్ద‌రు త‌మ్ముళ్లు కూడా విశ్వ చేతిలోనే చ‌స్తారు. అస‌లు మున‌స్వామి అండ్ బ్ర‌ద‌ర్స్‌పై ప్ర‌కృతి ఎందుకు కోపం తెచ్చుకుంటుంది? చివ‌ర‌కు మున‌స్వామి ప‌రిస్థితేంటి? అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ...

గాలి, నిప్పు, నేల‌, మ‌ట్టి, ఆకాశం.. ఈ పంచ‌భూతాలు మ‌నిషిని సృష్టిస్తాయి, నాశ‌నం చేస్తాయి. ప్ర‌కృతి ధ‌ర్మాన్ని మ‌నం పాటిస్తే మ‌న ఉన్న‌తికి తోడ్పడుతాయి. వాటిని అతిక్ర‌మిస్తే అంతం చూస్తాయి. అష్ట‌దిక్కుల్లో ఏ క‌న్ను చూడ‌క‌పోయినా, మ‌నం చేసే మంచి చెడుల‌ను పైనుంచి భ‌గవంతుడు చూస్తుంటాడు. మంచి చెడుల‌ను బేరీజు వేసి పాపాన్ని ప్ర‌క్షాళ‌న చేస్తాడు. మ‌నిషి ధ‌ర్మాన్ని పాటించాలి అని చెప్పే సినిమా ఇది. హీరో బ్యాక్‌గ్రౌండ్‌, హీరోయిన్ కేర‌క్ట‌ర్ బావున్నాయి. ప్రకృతితో రంగరించిన ఈ సాక్షాన్ని లాజిక్ లేకుండా చూడగలిగితే మంచి సినిమానే.

ప్ల‌స్ పాయింట్లు:

- డైలాగులు

- ప్రొడ‌క్షన్ వాల్యూస్‌

- విజువ‌ల్స్

- రీరికార్డింగ్‌

మైన‌స్ పాయింట్లు:

- క‌న్‌ఫ్యూజన్‌

- సంగీతం

రేటింగ్ : 3 / 5

Related News