వివాదాలకు కేరాఫ్ గా ఉన్న రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన అడల్ట్ చిత్రం ఆర్ ఎక్స్ 100. జూలై 12న విడుదలైన ఆర్ ఎక్స్ 100 చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకొని భారీ వసూళ్ళు సాధించింది. చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ యువతకి బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కేవలం తన గ్లామర్‌తోనే కాక బోల్డ్ క్యారెక్టర్లో జీవించింది. ఒకవైపు కోరికతో రగిలిపోతూ, లోలోపల కుట్రలు చేయడం సినీ ప్రేక్షకలోకానికి కొత్తగా అనిపించింది. ఇక లిప్ లాక్ సీన్స్ లోను ఈ అమ్మడు అదరగొట్టింది.
పాయల్ పాత్రని ఎంతో మంది రిజెక్ట్ చేసిన డేరింగ్‌గా తాను ముందుకు వచ్చి ఇచ్చిన పాత్రకి న్యాయం చేసింది. ఇప్పుడు ఈ అమ్మడిని వరుస ఆఫర్స్ పలకరిస్తున్నాయి. అయితే ఏ మాత్రం తొందరపడకుండా సెలక్టెడ్‌గా సినిమాలని ఎంపిక చేసుకుంటుంది. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సినిమాలో రాజ్‌పుత్ పాయల్ ఎంపికైందని అప్పట్లో వార్తలు రాగా, ఇప్పుడు దర్శకుడు భాను శంకర్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. ఇందులో ఆమెకు కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండనున్నాయని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నెలలోనే ప్రారంభం కానుంది.