ఐపియల్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది డబ్బు. ఆటగాళ్లను భారి సొమ్ము వెచ్చించి కొనుగోలు చేస్తారు. అయితే వారు న్యాయ౦ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే ఆ ఆటగాళ్ళు మాత్రం స్టార్ గుర్తింపు తెచ్చుకుంటాడు. తాజాగా ఒక ఆటగాడు ఒక్కో వికెట్ కి కోటి రూపాయలు తీసుకుంటున్నాడు. ఐపీఎల్-2018 వేలంలో అత్యంత ఖరీదైన భారత ఆటగాడిగా జయదేవ్ ఉనద్కత్ రికార్డులకెక్కాడు. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ అతడిని రూ.11.5 కోట్లకు కొనుగోలు చేసింది.
అయితే, తనపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న జట్టుకు మాత్రం ఉనద్కత్ పెద్దగా ఉపయోగపడలేకపోయాడు. పేలవ ఫామ్‌తో వికెట్లు రాబట్టడంలో విఫలమయ్యాడు. ఈ ఐపీఎల్లో మొత్తం 15 మ్యాచ్‌లు ఆడిన ఉనద్కత్ 11 వికెట్లు మాత్రమే తీశాడు. అంటే.. యాజమాన్యం తనపై పెట్టిన రూ.11.5 కోట్లకు.. రూ.కోటికి ఓ వికెట్ చొప్పున పడగొట్టాడన్నమాట. 26 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్ 44.18 బౌలింగ్ సగటు మాత్రమే నమోదు చేశాడు. ఇక, ఎకానమీ రేటు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 16.50 ఎకానమీ రేటుతో చెత్త గణాంకాలు నమోదు చేశాడు. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ తీవ్రంగా నిరాశ పరిచాడు. రెండు ఓవర్లు మాత్రమే వేసిన జయదేవ్ 33 పరుగులు సమర్పించుకున్నాడు.