ఎల్సీడీలు తయారు చేసే ట్విన్ స్టార్ డిస్ప్లే టెక్నాలజీస్‌కు చెందిన రూ.9,000 కోట్ల ఎఫ్‌డీఐ ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఆమోదం తెలిపింది. మారిషస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ట్విన్ స్టార్ ఓవర్సీస్ ఈ పెట్టుబడులు దేశీయంగా పెడుతుంది. వేదాంతా గ్రూప్ యజమాని అనిల్ అగర్వాల్ కుటుంబం ట్విన్ స్టార్ డిస్ప్లే టెక్నాలజీస్‌ను ప్రమోట్ చేస్తోంది. 2025 నాటికి లేదా అంతకు లోపే రూ.9,000 కోట్ల వరకు పెట్టుబడులు ట్విన్ స్టార్ ఓవర్సీస్ పెట్టనుంది. తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 30,000 మందికి పైగా ఉపాధి లభించే అవకాశం ఉందని వెల్లడించింది.