//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

8 లక్షల కోట్ల టెలికాం మొండి బకాయిలు....బ్యాంకులను వెంటాడుతున్న టైంబాంబ్ !

Category : business national

టెలికాం రంగం నుండి పేరుకుపోయిన రూ 8 లక్షల కోట్ల మేరకు పేరుకు పోయిన మొండి బకాయిలు దేశంలోని  బ్యాంకులకు పెద్ద టైబాంబ్‌గా మారుతున్నాయి. రిలయన్స్‌ జియో తెచ్చిన తీవ్ర పోటీతో  టెలికం సంస్థలు బ్యాంక్ లకు కట్టవలసిన అప్పులు భారీగా పేరుకు పోయాయి.

భారీ ఎత్తున్న రుణాలు పొందిన టెలికాం రంగం వైఫల్యం పరిశ్రమలో డిఫాల్టర్‌గా మారబోతుందంటూ ప్రధాన బ్యాంకులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే బ్యాంకులకు పేమెంట్లు చెల్లించడంలో డిఫాల్టర్స్‌గా మారుతున్నాయని టెలికాం కార్యదర్శికి ఇచ్చిన నివేదికలో బ్యాంకులు పేర్కొన్నాయి. 

టెలికాంకు బ్యాంకులు ప్రత్యక్షంగా రూ.2.63 లక్షల కోట్ల అప్పులివ్వగా, రూ.3.09 లక్షల కోట్ల స్పెక్ట్రమ్‌ పేమెంట్లను టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించకుండా వాయిదా వేశాయి. ఆపరేటర్స్‌ కాంట్రాక్ట్స్‌పై ఆధారపడిన థర్డ్‌ పార్టీ రుణాలు సుమారు రూ. 1.8 లక్షల కోట్లగా ఉన్నాయని టెలికం సెక్రటరీకి వివరాలు అందజేశాయి. దీనికి అదనంగా వార్షిక మూలధన ఖర్చులు రూ.35వేల కోట్లుగా ఉంటాయని అంచనా వేసింది.

భారీ మొత్తంలో అప్పులు పొందిన టెలికం రంగంలో పెద్ద ఆశాజనక వృద్ధి రేటు కూడా కనబడుట లేదని బ్యాంకు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2019 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి టెలికాం రంగం వార్షిక వృద్ధి రేటు 25 శాతం పడిపోయి రూ.1.31 లక్షల  కోట్లకు దిగజార నుందని బ్యాంకులు అంచనా వేశాయి. 

20 శాతం ఆప రేటింగ్‌ మార్జిన్లతో టెల్కోలు బ్యాంకులకు సరైన చెల్లింపులు చేయలేవని పేర్కొన్నాయి. టెలికం కంపెనీలు రూ.5.72 లక్షల కోట్ల అప్పులు చెల్లించ డానికి వీలుగా తగినన్ని నిధులు సమకూర్చుకోవాలని సూచించాయి. ఇప్పటికే ఒత్తిడి లో ఉన్న టెలికం రంగ సేవల పై జీఎస్టీ అమలులోకి వస్తే పన్నుల భారం 15 శాతం నుండి 18 శాతంకు పెరుగనున్నాయి.