//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆజాంఖాన్ నాలుక తేస్తే రూ.50 లక్షల రివార్డు.

Category : national

అసోం, జార్ఖండ్, కశ్మీర్ రాష్ట్రాల్లో మహిళలపై సైనికుల వేధింపులు శ్రుతి మించాయని, మహిళలను వేధించే సైనికుల మర్మాంగాలను కోసివేయండని సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. షహజాన్‌పూర్ జిల్లా వీహెచ్‌పీ ఓ అడుగు ముందుకు వేసి సైన్యాన్ని కించపరచి అవాకులూ చవాకులూ పేలిన ఆజంఖాన్ నాలుకు తెచ్చిన వారికి రూ.50 లక్షలు రివార్డుగా ఇస్తామని ప్రకటించింది. వీహెచ్‌పీ జిల్లా కో-ఆర్డినేటర్ రాజేష్ కుమార్ అవస్థి స్వయంగా మీడియా ముందే ఈ రివార్డు ప్రకటించారు. ఆజంఖాన్ నాలుక తెచ్చి ఇస్తే తక్షణమే రివార్డు మొత్తం అందజేస్తామన్నారు. సైన్యంపై దారుణ విమర్శలు చేసిన ఆజంఖాన్ ఇండియాలో నివసించడానికి అనర్హుడని, తక్షణం ఆయన దేశం విడిచి వెళ్లాలని అన్నారు. ఆజంఖాన్ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను కలెక్టరేట్ కార్యాలయం వెలుపల వీహెచ్‌పీ కార్యకర్తలు దగ్ధం చేశారు.