ఫ్లిప్ కార్ట్ డిస్పాచ్ సెంటర్ నుంచి దాదాపు 37 లక్షల రూపాయల విలువ చేసే వస్తువులను ఎత్తుకెళ్లారు దొంగలు. ఢిల్లీలోని జిల్ మిల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఫ్లిప్ కార్ట్ డిస్పాచ్ సెంటర్ కు ముసుగు వేసుకొని నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం వచ్చారు. సీసీటీవీ కెమెరాలను కూడా తొలగించి దొంగతనానికి పాల్పడ్డారు. సెంటర్ కు కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డ్ తల పగలగొట్టి లోపలికి వెళ్లిన దుండగులు దాదాపు రూ. 37 లక్షల విలువైన ప్రాడక్ట్స్ ను దొంగలించుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దుండగుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు.