//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

త్వరలో రెండు వందల నోట్లు.. బ్యాంకుల ద్వారానే చలామణి!

Category : sports state national

దేశవ్యాప్తంగా సర్క్యూలేషన్ లో ఉన్న 86శాతం కరెన్సీని ఒక్కసారిగా రద్దు చేసి ప్రజలను షాక్ గురిచేసిన విషయం మరువకముందే మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI). కొత్తగా రూ.200 నోటును జూన్ నుంచి ప్రవేశపెట్టబోతున్నట్టు కార్యదర్శుల భేటీలో తీసుకున్న నిర్ణయానికి RBI గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలో చిల్లర కష్టాలను తొలగించడానికే కొత్తగా రూ.200 నోటును తీసురానున్నట్టు వెల్లడిచింది RBI. కొత్త రూ.200 నోటును ATMలలో కాకుండా బ్యాంకుల ద్వారా మాత్రమే సరఫరా చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 2 లక్షల 20వేల ATMల ద్వారా కొత్త నోట్ లను లోడ్ చేయడానికి, రవాణాకు రెండు నెలల సమయం పడుతుందని బ్యాంకు అధికారులు భావిస్తున్నారు. ఆ ఆలస్యాన్ని నివారించేందుకు.. ATMలలో కాకుండా బ్యాంకుల ద్వారానే కొత్త రూ.200 నోట్లను చెలామణిలోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలిపారు బ్యాంకు అధికారులు.పెద్ద నోట్లరద్దు తర్వాత ప్రవేశపెట్టిన 500, 2,000 రూపాయల నోట్లను ఎంటిఎంల ద్వారా చలామణిలోకి తెచ్చేందుకు పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆర్‌బిఐ, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

Related News