//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రూ.1 కే విమానయానం !

Category : national

విమానంలో ప్రయాణించాలని ఉందా? అయితే మీకొక శుభవార్త. రూ.1కే మీరు విమానంలో ప్రయాణించవచ్చు. ఎలా అని ఆశ్చర్యపోతున్నారా…. దేశీయ తొలి బడ్జెట్‌ విమానయాన సంస్థ ఎయిర్‌డెక్కన్‌ మళ్లీ వైమానిక మార్కెట్లోకి రానుంది. త్వరలోనే ఈ ఎయిర్‌లైన్‌ తిరిగి సేవలను ప్రారంభించనుంది.

చౌక ధరలకే విమాన ప్రయాణాన్ని అందించేందుకు 2003లో జీ.ఆర్‌. గోపినాథ్‌ ఎయిర్‌డెక్కన్‌ విమానయాన సంస్థను ప్రారంభించారు. 2008లో ఈ సంస్థ ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌తో విలీనమైంది.

అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2012లో ఈ సంస్థ సర్వీసులను నిలిపివేసింది. ఓ ఇంగ్లీష్ ఛానల్ కి తాజాగా ఇచ్చిన ఇంటర్యూలో గోపినాథ్ మాట్లాడుతూ… ఎయిర్‌ డెక్కన్ త్వరలోనే తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించనుందని, ఈ నెలాఖరులో ముంబయి, దిల్లీ, కోల్‌కతా, షిల్లాంగ్‌ నుంచి సమీపంలోని నగరాలకు విమానాలు నడపనున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ 22న ముంబయి నుంచి నాసిక్‌కు మొదటి ఎయిర్‌డెక్కన్‌ విమానం నడపనున్నామన్నారు. ప్రయాణికులకు ఆకర్షించేందుకు తక్కువ ధరలకే విమాన టికెట్లను అందించనున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన ఉడాన్‌ పధకం కన్నా తక్కువగా 40 నిమిషాల ప్రయాణానికి రూ.1400 ఛార్జీ చేయనున్నామన్నారు. టిక్కెట్ల విక్రయ ప్రారంభ రోజుల్లో కొందరు లక్కీ ప్రయాణికులకు కేవలం రూ.1కే విమాన టికెట్‌ అందించనున్నట్లు గోపినాథ్‌ తెలిపారు. జనవరి చివరి వరకు మిగతా మూడుచోట్ల కూడా సర్వీసులను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఎయిర్‌డెక్కన్‌ పూర్తి షెడ్యూల్‌పై మాత్రం స్పష్టత లేదు.

Related News