//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రిలయన్స్ పై రూ 1,700 కోట్ల జరిమానా

Category : business

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్), దాని భాగస్వాములు బీపీ, నికోపై కేంద్ర ప్రభుత్వం తాజాగా 26.4 కోట్ల డాలర్ల (దాదాపు రూ.1,700 కోట్లు) జరిమానా విధించింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి కేజీ బేసిన్‌లోని డీ6 బ్లాక్ నుంచి లక్ష్యానికంటే తక్కువ గ్యాస్ ఉత్పత్తి చేసినందుకు గాను గుత్తేదారు సంస్థలపై ప్రభుత్వం ఈ పెనాల్టీ విధించింది.

దీంతో ఏప్రిల్ 1, 2010 నుంచి గడిచిన ఆరేండ్లలో రిలయన్స్, బీపీ, నికోపై విధించిన మొత్తం జరిమానా 302 కోట్ల డాలర్లకు చేరుకుందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్పత్తి పంపిణీ ఒప్పందం (పీఎస్‌సీ) ప్రకారంగా ప్రధాన గుత్తేదారు ఆర్‌ఐఎల్ దాని భాగస్వాములైన బీపీ, నికో సంస్థలు కేబీబేసిన్ డీ6 బ్లాక్ గ్యాస్‌ను విక్రయించగా వచ్చిన లాభాలను ప్రభుత్వంతో పంచుకునేముందు అందులోంచి క్షేత్ర అభివృద్ధి, నిర్వహణకయ్యే ఖర్చులను మినహాయించుకునేందుకు వీలుంటుంది.

అయితే, ప్రభుత్వం విధించిన జరిమాన విలువకు సమానమైన ఖర్చులను లాభాల నుంచి మినహాయించుకునే అవకాశాన్ని సంస్థలు కోల్పోతాయి. తద్వారా కేజీ బేసిన్ గ్యాస్ విక్రయం ద్వారా ప్రభుత్వానికొచ్చే లాభాల వాటా పెరుగుతుంది.గుత్తేదారు వ్యయ ఖర్చుల మినహాయింపుల్లో కొంత మొత్తానికి అనుమతివ్వకుండా ప్రభుత్వం అదనంగా 17.5 కోట్ల డాలర్ల లాభాలను క్లెయిమ్ చేసుకోవడం జరిగిందని అధికారి ఒకరు తెలిపారు.