గత 30 సంవత్సరాలలో కొటాక్ మహీంద్రా గ్రూప్ తిరుగులేని విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఈరోజు దేశంలోనే అతి పెద్ద ఫైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీగా రూపాంతరం చెందింది. కొటాక్ మహీంద్రా గ్రూప్ లో 1985లో పెట్టుబడిగా లక్ష రూపాయలు పెడితే దాని విలువ ఇప్పుడు రూ.1400 కోట్లు ఉందంటే కంపెనీ ప్రస్థానం ఎంత గొప్పగా ఉందొ ఊహించవచ్చు. 1985లో కొటాక్ మహీంద్రా గ్రూప్ &క్యాపిటల్ మేనేజెమెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ గా అవతరించింది. ఈ కంపెనీని ఉదయ్ కొటాక్ , సిడ్నీ ఏ.ఏ పింటో, కొటాక్ అండ్ కంపెనీలు కలిసి ప్రారంభించారు. మహీంద్రా అండ్ మహీంద్రా కు చెందిన ఆనంద్ మహీంద్రా ఈ కంపెనీని మొదటినుంచి అండగా నిలిచాడు.
1986లో హరీష్ మహీంద్రా, ఆనంద్ మహీంద్రాలు పెట్టుబడి పెట్టిన అనంతరం 2003లో కంపెనీ 'కోటక్ మహీంద్రా ఫైనాన్స్' లిమిటెడ్ గా మారింది. తర్వాత కమర్షియల్ బ్యాంకుగా అవతరించింది. ఏప్రిల్ 1st ,2015 నుంచి ఇన్ గ్ వైశ్య బ్యాంకు ఈ బ్యాంకు లో విలీనమైంది. డిసెంబర్ 31st ,2016 నాటికి కొటాక్ మహీంద్రా బ్యాంకులో దేశవ్యాప్తంగా 1350 బ్రాంచీలున్నాయి. పోయిన నెలలో మార్కెట్ నుంచి 5,300 కోట్లు పెట్టుబడిని సమకూర్చుకునేందుకు బోర్డు నిర్ణయంచింది. ఈ డబ్బుతో కొటాక్ మహీంద్రా బ్యాంకు సుస్థిరమైన పథంలో పయనించటానికి తోడ్పడనుండది. మనకున్న విజయగాధాల్లో ఈ కోటక్ మహీంద్రా గ్రూప్ ప్రస్థానం చిరస్థాయిగా నిలిచిపోతుంది.