//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

"ఆర్ఆర్ఆర్" సినిమా ఫొటోస్ లీక్ ...స్టోరీ ఏంటో తెలిసింది.

Category : movies

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ హీరోలుగా భారీ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా సాగుతోంది.ఇప్పటికే మొదటి షెడ్యూలు పూర్తి చేసుకుని రెండో షెడ్యూలు కి వెళ్లిన "ట్రిపుల్ ఆర్ " మూవీ.అయితే ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించిన కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి ..

ఇపుడా ఫోటోస్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకూ ఈ సినిమా స్టోరీ విషయంలో అనేక అనుమానాలు, ఇంకెన్నో అంచనాలు ఉన్నాయి.ఇపుడు ఈ అంచనాలను బలపరుస్తూ లీక్ అయినా ఈ ఫోటీల్లో చూస్తే తెలుస్తుంది. ఇది ఒక పిరియాడికల్ మూవీ అని.. స్వాతంత్రమునకు పూర్వం జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోందని..

తాజాగా లీకైన పిక్స్‌ని బట్టి చూస్తే ఇది రూమర్ కాదని.. అక్షరాలా నిజమని తెలుస్తోంది. పిక్స్‌ని బట్టి చూస్తే.. ఇది పిరియాడికల్ మూవీ అని.. స్వాతంత్ర నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు స్పష్టమవుతోంది. లీకైన ఫోటోల్లో పోలీస్ స్టేషన్ సెట్‌ ఒకటి కనిపిస్తోంది. ఆ పోలీస్ స్టేషన్ ఎదుట బ్రిటీష్ వాళ్ల ఫ్లాగ్ ఒకటి కనిపిస్తోంది. సినిమాలో నటించే వారి వేషధారణ నాటి పరిస్థితులకు అద్దం పడుతోంది. సెట్‌లో చెర్రీ పిక్ కూడా కనిపిస్తోంది.ఈ లెక్కన మరో మారు బ్లాక్ బస్టర్ ప్రేక్షకులకు అందించే దిశగా దర్శక ధీరుడి పని తనం కనిపిస్తుంది.

Related News