//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మేఘాలయ బిజెపి లో చిచ్చు రేపిన బీఫ్ పార్టీ

Category : national politics

పశువధ అమలుకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ ఉత్తరువుకు నిరసనగా దేశ వ్యాప్తంగా `బీఫ్ పార్టీ' లను పలువురు జరుపుతూ ఉందీ, ఈ పార్టీ మేఘాలయ బిజెపి లో చిచ్చు రేపింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడో వార్షికోత్సవం సందర్భంగా జరుపుకొనే సంబరాలలో భాగంగా `బిచ్చి బీఫ్ పార్టీ' జరపాలని ఒక నాయకుడు నిర్ణయించారు. అయితే పార్టీ సీనియర్ నాయకులు అందుకు అభ్యంతరం చెప్పడంతో ఆయన బిజెపి కే రాజీనామా చేశారు. 

స్థానికుల సంస్కృతి, సంప్రదాయాలను పార్టీ నేతలు గౌరవించడంలేదని పశ్చిమ గారో హిల్స్‌ జిల్లా అధ్యక్షులు బెర్నార్డ మారక్‌ విమర్శించారు. 'వేడుకలు, విందులు చేసుకునేందుకు ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజన ప్రజలకు సొంత శైలి ఉంది. వేడుక సందర్భంగా గోవును బలి ఇవ్వడం గారో కొండ ప్రాంత ప్రజల ఆచారం. ఈ నేపథ్యంలోనే మేము మోడీ పాలన మూడేండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా చిన్న బీఫ్‌ పార్టీని ఏర్పాటుచేసుకోవాలనుకున్నాం. కానీ, పార్టీ నాయకులు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు' అని మారక్‌ అన్నారు. 

'మా గారో సంస్కతీ సంప్రదాయాలను సజీవంగా ఉంచడానికి ఇష్టపడని ఈ రాజకీయ పార్టీలో ఉండటంలో అర్థం లేదు? వారు (బీజేపీ నాయకులు) మా ఆహారపు అలవాట్లను శాసించలేరు' అని విమర్శించారు. గారో మాండలికంలో బిచీ అనగా బియ్యం బీర్‌ అని అర్ధం.బీఫ్‌ మా సంప్రదాయ ఆహారమని, అందుకే బీఫ్‌ పార్టీకి తాము సిద్ధమయ్యాయని బీజేపీ ఉత్తర గారో హిల్స్‌ జిల్లా అధ్యక్షుడు బచూ చంబుగొంగ్‌ మరాక్‌ అన్నారు. గారో గిరిజన ప్రజలమైన తాము గొడ్డు మాంసం తినకుండా జీవించలేమని అన్నారు. 

ఇంతకు ముందు బిజెపి రాష్ట్రంలో అధికారమలోకి వస్తే ప్రజలకు తక్కువ ధరకు బీఫ్ అందుబాటులోకి తెస్తామని ప్రకటించడం గమనార్హం. కాగా బిజెపి జాతీయ అధికార ప్రతినిధి నలిన్‌ కోహ్లీ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఏ గిరిజనుల సంప్రదాయ ఆహార అలవాట్లకు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని సమర్థించుకున్నారు.

Related News