//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రోజాను ఆ జంతువుతో పోల్చిన గ‌ల్లా జ‌య‌దేవ్..!

Category : politics

వైసీపీ ఎమ్మెల్యే రోజాని అందరూ ఎమ్మెల్యే రోజా అనడం కంటే జబర్దస్త్ జడ్జ్ గా మాత్రమే గుర్తిస్తారు. ఆ షో లో గత ఎన్నో సంవత్సరాలుగా సాగుతున్న ఆమె వెకిలి నవ్వులు నవ్వడంలో మాత్రం ముందు ఉంటారు.

అవక అవక ల‌క్‌గా ఎమ్మెల్యే అయినా కూడా గెలిచిన దగ్గర నుంచీ ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా రోజా ఎప్పుడూ నగరి నియోజికవర్గ ప్రజలని పట్టించుకోలేదు అనే అపవాదు ఉండనే ఉంది. రోజా నగరి వీధుల్లో తిరిగితే నెత్తిన చెప్పులు కూడా విసిరిన సందర్భాలు ఉన్నాయి.రీసెంట్ గా మోడీ కి సైతం చుక్కలు చూపించిన గల్లా జయదేవ్ ఇప్పుడు ఏకంగా రోజా కి చుక్కలు చూపించాడు.

ఆమె రీసెంట్ గా గల్లా మీద పంచ్ లు వెయ్యడం తో ఆయన రియాక్షన్ చూసి బిత్తర పోయింది రోజా. రోజా గుంటూరు ఎంపీ గల్లా మీద చేసిన వ్యాఖ్యలకి టీడీపీ నిరసన తెలిపింది. మోడీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని వైసీపీ సపోర్ట్ చేస్తుంటే తమ పార్టీ ఎంపీ మాత్రమే ధైర్యంగా పోరాడాడు అనే విషయం గుర్తు చేస్తూ రోజాకి అందరూ క్లాస్ పీకుతున్నారు.

రోజా మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేసింది గల్లాని గుండాయన అంటూ సంభోదించి ఎందుకు ఆ గుండాయనకి అంత ఘనంగా స్వాగతం చెప్తున్నారు అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రోజా జగన్ ఇద్దరినీ కలిపి జనాలు ఈ విషయంలో తిడుతున్నారు.

జగన్ రోజాని కంట్రోల్ చెయ్యకపోవడం వల్లనే ఇలాంటి తలనొప్పులు ఎదురు అవుతున్నాయి అంటున్నారు చాలా మంది. రోజా చేసిన వ్యాఖ్యలకి గల్లా కూడా సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. రోజా మాటలు మనల్ని బాధ పెట్టినా సరే కుక్కలు అలాగే మొరుగుతాయ్ మనం వాళ్ళని కేర్ చెయ్యక్కరలేదు అంటూ తన కార్యకర్తల దగ్గర మాట్లాడారట గల్లా జయదేవ్.

ఈ మాటలు ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తున్నాయి. రోజా లాంటి వ్యక్తిని కుక్కతో పోల్చడం అంటే గల్లా కి గట్స్ ఉండాలి , ఎందుకంటే రోజా చాలా పెంకి మనిషి రోజా ని కెలకడానికి కూడా ఎవ్వరూ ఇష్టపడరు. పైకి ఆమెతో రచ్చ పెట్టుకోకుండా తెరవేనకాల కార్యకర్తలని కూల్ చేశారు అంటే చిన్న విషయం కాదు మరి.

ఒక ఆమె ప్రాథినిత్యం వ‌హిస్తోన్న న‌గ‌రిలో ఇప్పుడు ఆమే కాదు ఆమె ప్లేసులో ఎవ‌రు ఉన్నా గెలిచే ఛాన్సే లేద‌ని ఆమె లాంటి వారి మాట‌ల‌ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పార‌ట‌.