ప్రపంచకప్లో భాగంగా మంగళవారం జరిగిన టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్లో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రారంభం నుండి బౌండరీల మోత మోగిస్తున్న ఓపెనర్ రోహిత్ శర్మ, నిన్న ఆడిన మ్యాచ్ లో సెంచరీ క్రాస్ చేసి అందరును ఆనందపరిచారు. అదె సమయం లో హిట్మ్యాన్ ఐదు అద్భుతమైన సిక్సర్లు బాదిన విషయం తెలిసిందే, ఈ క్రమంలో రోహిత్ కొట్టిన ఓ సిక్సర్ బంతి ఓ మహిళా అభిమానికి తగిలింది. 104 పరుగులు చేసి అవుట్ అయిన రోహిత్, మైదానం నుంచి వెలుతూ ఆగి అక్కడున్న అభిమానులను అడిగాడు తన బంతి ఎవరికి తగిలిందో చెప్పమనీ వారిని కోరాడు. మ్యాచ్ పూర్తయిన అనంతరం ఆమెను పిలిపించి,
మాట్లాడి ఆమె హ్యాట్ మీద సంతకం చేసిచ్చిన హిట్మ్యాన్. ఆమెతో కలిసి రోహిత్ ఫోటోలకు పోజులిచ్చాడు. ఆ ఫోటోలును బీసీసీఐ పంచుకుంది, ఇప్పుడు అవి ట్విటర్లో వైరల్ గా మారాయి. దానితో అభిమానులు,నెటిజన్లు సోషల్ మీడియా వేదిక గా రోహిత్ ఫై ప్రశంసల జలు కురిపిస్తున్నారు. అభిమాని ఫై తన అభిమానం చాటుకున్న రోహిత్, ఆనందం లో అభిమానులు . ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు రోహిత్ నాలుగు శతకాలు చేశాడు. నిన్న జరిగిన మ్యాచ్లో శతకం చేయడంతో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. మొదట భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 314 పరుగులు చేయగా... ఛేదనలో బంగ్లా 48 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. ఇంకో లీగ్ మ్యాచ్ ఉన్నప్పటికి ఘనంగా సెమిస్ కి చేరుకున్న టీం ఇండియా.