Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

"నేను దేశం కోసం ఆడతా"...రోహిత్ శర్మ?

Category : sports

టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ట్విట్టర్‌లో చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 'నేను బయటికి వచ్చేసింది కేవలం జట్టు కోసమే కాదు..నా దేశం కోసం బయటికి వచ్చాను' అని ట్విట్టర్లో పోస్టు చేశాడు. అయితే వరల్డ్ కప్ టోర్నీలో కెప్టెన్ కోహ్లీకి మరియు రోహిత్ శర్మకు మధ్య విభేదాలు వచ్చాయంటూ రూమర్లు వినిపించాయి. అయితే వాటిని బలపరచేలా రోహిత్ శర్మ, కోహ్లీ సోషల్ మీడియా అకౌంట్‌ను అన్ ఫాలో చేసేశాడు. అనుష్క శర్మ కూడా దీనిపై స్పందించింది. అంతా మరిచిపోవాలని, ఏం గొడవలు వారి మధ్య లేవని మీడియా ముందు చెప్పాలని రోహిత్ శర్మకు చెపింది.

వెస్టిండీస్ టూర్‌కు వెళ్లబోయే ముందు వీటిపై విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు. "చాలా కాలం నుంచి చూస్తున్నా. వ్యక్తిగత విషయాలను మీడియా ముందుపెడుతున్నారు. ఇది చాలా అవమానకరమైన విషయం. నాకు రోహిత్‌కు మధ్య ఎలాంటి విద్వేషాలు లేవు. ఈ రూమర్లను దాటి నిజాన్ని చూపించాలనుకుంటున్నాం. కొన్నిసార్లు మంచి జరగాలంటే గుడ్డిగా ఉండకతప్పదు" అని కోహ్లీ వివరణ కూడా ఇచ్చాడు. ఇక టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో భాగంగా మంగళవారం అక్కడికి చేరుకుంది. ఆగష్టు 3నుంచి మూడు టీ20లు, 3వన్డేలు, 2టెస్టులు ఆడనుంది.