ఇంగ్లాండ్‌తో వన్డే, టీ ట్వంటీ సిరీస్‌లు ముగియడంతో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ తన సతీమణితో కలిసి విహార యాత్రలో బిజీ గా ఉన్నాడు. ఇటీవల లండన్ చుట్టొచ్చిన రోహిత్‌శర్మ ప్రస్తుతం ప్రేగ్లో విహరిస్తున్నాడు. తన భార్యతో కలిసి ఎంజాయ్ చేసిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
ప్రేగ్ అందమైన నగరంలో విహరిస్తున్నానంటూ ఓ ఫొటోను రోహిత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. దానికి స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ఓ చిలిపి కామెంట్ పెట్టాడు. ‘మిస్ యు రోహితా.... శర్మా’.. అంటూ పేరును సాగదీస్తున్నట్లుగా ఆ ఫొటోకు కామెంట్ పెట్టాడు. దీనికి రోహిత్ సతీమణి రితికా సజ్దె రిప్లై ఇచ్చారు. ‘యూజీ.. ప్రస్తుతం రోహిత్ నావాడు’ అంటూ రితికా సమాధానమిచ్చారు.
ఇటీవల భారత క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ సతీమణులతో కలిసి లండన్‌లో విహరిస్తూ ప్రేమ భోజనాలు చేసిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 1 నుంచి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.