మొహాలీలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత హిట్ మ్యాన్ రోహిత్ శర్మ విజృంభించాడు. టీమిండియా కెప్టెన్ దెబ్బకు లంక ఆటగాళ్లు కళ్లు తేలేశారు. శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో మరో ద్విశతకాన్ని నమోదు చేసి మూడుసార్లు డబుల్ సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. మొత్తం 151 బంతుల్లో 13 బౌండరీలు, 12 సిక్సర్లతో ఈ మహత్తరమైన రికార్డును నెలకొల్పాడు.
ఇంతకు ముందు భారత ఆటగాళ్ళలో సచిన్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే డబుల్ సెంచరీలు సాధించారు. రోహిత్ సాధించిన ఈ అరుదైన విన్యాసంతో స్టేడియంలోని టీమిండియా అభిమానులు ఆనందంతో తాండవం చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ (208) రికార్డు డబుల్ సెంచరీ సాధించడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లు పూర్తయ్యేసరికి నాలుగు వికెట్లకు 392 పరుగులు చేసింది. వన్డే ఫార్మాట్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ 2014లో శ్రీలంకతో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 264 పరుగులు, 2013లో ఆస్ట్రేలియాతో బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో 209 పరుగులు చేశాడు. తాజాగా మొహలీలో శ్రీలకంపై మూడో డబుల్ సెంచరీ సాధించాడు.