//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రోహిత్ శర్మ@ 10 ,000

Category : sports

రోహిత్ శర్మ టీం ఇండియా సంచలనం. ఓపెనర్ గా అడుగు పెట్టి టీం లో మోస్ట్ వాంటెడ్ ప్లేయర్ గా ఎదిగాడు. రోహిత్ ఉంటె చాలు మ్యాచ్ ను గెలిపిస్తాడు అన్న కోణం లోకి అభిమానులను తీసుకువచ్చాడు. హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘనతను అందుకున్నాడు.

తాజాగా అతడు పదివేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్థానం దక్కించుకున్నాడు. ఐర్లాండ్‌తో జరిగిన టీ20లో రోహిత్‌ శర్మ 97 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో 10వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

టెస్టు, వన్డే, టీ20.. ఈ మూడు ఫార్మాట్లలో కలిపి రోహిత్‌ శర్మ సాధించిన పరుగులు 10,022. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఐర్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆతిథ్య ఐర్లాండ్‌తో భారత జట్టు రెండు టీ20లు ఆడుతోంది. షెడ్యూల్‌లో భాగంగా బుధవారం ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరిగింది.

ఈ మ్యాచ్‌లో భారత్‌ 76 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ-శిఖకర్‌ధావన్‌ తొలి వికెట్‌కు 160 పరుగులు జోడించారు. ఆఖరి ఓవర్‌ వరకు మైదానంలో ఉన్న రోహిత్‌ త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు.