భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ బాగా అలసిపోయాడు. దీంతో తనకు విశ్రాంతి కల్పించాలని కోహ్లీ బీసీసీఐని కోరాడట. ఫలితంగా అతను న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం న్యూజిలాండ్‌తో భారత్ వన్డే సిరీస్‌లో తలపడుతోంది. ఆదివారం ముంబయిలో జరిగిన వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. సిరీస్‌లో భాగంగా తదుపరి వన్డే బుధవారం పుణెలో జరగనుంది. మరోపక్క వన్డే సిరీస్ అనంతరం టీమిండియా న్యూజిలాండ్‌తో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను ఆడనుంది. కివీస్‌తో తలపడే భారత టీ20 జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించనుంది. ఇదిలా ఉండగా కెప్టెన్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల క్రికెట్ నుంచి కాస్త విరామం కావాలని బీసీసీఐ, సెలక్టర్లను కోరాడట. దీంతో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు కోహ్లీకి విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. వైస్‌కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అందించాలని చూస్తున్నారు.
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో పాటు శ్రీలంకతో సిరీస్‌కు కూడా కోహ్లీ దూరమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ముగిసిన అనంతరం నవంబరు 16 నుంచి శ్రీలంకతో మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. అనంతరం జనవరిలో భారత్.. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ బిజీ షెడ్యూల్ కారణంగానే కోహ్లీ విరామం కోరినట్లు తెలుస్తోంది.