Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పాకిస్తాన్ లోని ఓ డాక్టర్ నిర్వాకం .... దాదాపు 400 మంది చిన్నారులకు హెచ్ఐవీ సోకెలా ఇంజక్ట్ చేశాడు....?

Category : world

మన దాయాది దేశం పాకిస్థాన్ లో చోటుచేసుకున్న దారుణం. ప్రాణాలు కాపాడాల్సిన ఓ డాక్టర్ చేసిన నిర్వాకం కాస్త,కొన్ని వందల మంది చిన్న పిల్లల ప్రాణాలకే ప్రమాదంగా మారింది. ఉద్దేశపూర్వకంగానో, అనుకోకుండానో ఓ వైద్యుడు కలుషిత సిరంజీని వాడాడు. దీంతో దాదాపు 400 మంది చిన్నారులకు ఎయిడ్స్(హెచ్ఐవీ వైరస్) సోకింది. దీంతో సదరు డాక్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టు ముందు హాజరుపరచి రిమాండ్ కు తరలించారు. లర్కానా జిల్లాలోని రటోడెరో ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ ముజఫర్ గంగర్ డాక్టర్ గా సేవలు అందిస్తున్నారు. అయితే అధిక మొత్తంలో సిరంజీలు అందుబాటులో లేకపోవడంతో వైద్యులు ఒకే సూదిని వేడినీటిలో మరగబెట్టి వాడటం ప్రారంభించారు. ఇలా ఒకే సిరంజిని వందల సార్లు వేరు ,వేరు వ్యక్తులకు వాడడం జరిగింది.

ఈ క్రమంలోనే దాదాపు 400 మంది చిన్నారులకు ఎయిడ్స్ సోకింది.వీరిలో అత్యధికులు చిన్నపిల్లలే ఉండడం గమనార్హం. ఈ విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు తీవ్ర విచారంలో మునిగిపోయారు.

ఒక్క సారిగా వందల సంఖ్యలో హెచ్. ఐ.వీ కేసులు బయటపడటంతో ఈ ఆసుపత్రి పరిధిలో చికిత్స పొందిన ప్రజలందరికీ హెచ్ఐవీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ఘోరానికి కారకుడైన వైద్యుడు ముజఫర్ కి కూడా ఎయిడ్స్ ఉన్నట్లు సదరు అధికారులు తేల్చారు. అయితే ఈ వ్యవహారంపై ముజఫర్ స్పందిస్తూ......‘'నాకు హెచ్‌ఐవీ ఉన్న సంగతి తెలియదు. కావాలనే కలుషిత సిరంజి వాడానని చేస్తున్న ఆరోపణ ల్లో కూడా వాస్తవం లేదంటూ’ స్పష్టం చేశాడు. ఇది ఇలా ఉంటే చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు దాతలు ముందుకు రావాలని పాకిస్థాన్ లోని ఉన్నతాధికారులు కోరుతున్నారు. ఎయిడ్స్ కేసులో పాకిస్థాన్ ఆసియాలోనే రెండో స్థానంలో ఉంది. ఒక్క 2017లోనే పాక్ లో దాదాపు 20,000 కు పైగా హెచ్ఐవీ కేసులు నమోదు అయ్యాయి అంటేనే దాని తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Related News