Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎనిమిదోసారి వింబుల్డన్ టైటిల్‌ను గెల్చుకున్న ఫెదరర్

Posted 7 months ago | Category : sports

స్విట్జర్లాండ్ సూపర్ స్టార్ రోజర్ ఫెదరర్ ప్రపంచ టెన్నిస్‌లో మరో సంచలనం సృష్టించాడు. ఎనిమిదోసారి వింబుల్డన్ టైటిల్‌ను గెలిచి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఈ ప్రపంచ ఐదో ర్యాంకర్ 6-3, 6-1, 6-4తో ప్రపంచ ఆరో ర్యాంకర్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై నెగ్గి ఈ ఘనతను అందుకున్నాడు. ఈ సందర్భంగా పీట్ సంప్రాస్ (7 టైటిల్స్) రికార్డును అధిగమించాడు. 

ఓవరాల్‌గా స్విస్ ప్లేయర్‌కు ఇది 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కాగా, ఓపెన్ ఎరాలో వింబుల్డన్ గెలిచిన ఓల్డెస్ట్ మ్యాన్ (35 ఏండ్లు)గా అవతరించాడు. 1976లో 32 ఏళ్ల వయసులో ఆర్థర్ యాషే ఈ టైటిల్‌ను సాధించాడు. 1976 తర్వాత వింబుల్డన్‌లో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా టైటిల్ నెగ్గిన తొలి ఆటగాడు ఫెదరర్. ఇంతకుముందు జోర్న్ బోర్గ్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.

కెరీర్‌లో 11వ వింబుల్డన్ ఫైనల్ ఆడుతున్న ఫెదరర్ (ఓవరాల్‌గా 29వ ఫైనల్) కోర్టులో చాలా ఉల్లాసంగా కనిపించాడు. భారీ ఏస్‌లు కొడతాడని పేరున్న సిలిచ్‌ను బేస్‌లైన్‌కు పరిమితం చేస్తూ తన రాకెట్ పవరెంటో చూపెట్టాడు. గంటా 41 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్విస్ స్టార్ ఎక్కడా తడబడలేదు. ఆరంభంలో ఇరువురు సర్వీస్‌లు నిలబెట్టుకున్నా నాలుగో గేమ్‌లో వచ్చిన బ్రేక్ పాయింట్‌ను సిలిచ్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 

ఈ విజయంతో ఫెదరర్ సోమవారం విడుదల చేయనున్న తాజా ర్యాంకింగ్స్‌లో మూడో ర్యాంక్‌కు ఎగబాకనున్నాడు. స్విస్ స్టార్ దాదాపు 11 నెలల తర్వాత మళ్లీ ఈ ర్యాంక్‌కు చేరుతుండటం విశేషం. 


మహిళల శక్తి మరోసారి చాటారు

Posted 16 hours ago | Category : sports

మహిళల శక్తి మరోసారి చాటారు

మరోసారి హిట్ మెన్ కెప్టెన్ కానున్నాడు

Posted a day ago | Category : sports

 మరోసారి హిట్ మెన్  కెప్టెన్ కానున్నాడు

పి వి సింధు అవార్డులు : pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton ins.media

Posted 4 days ago | Category : sports

పి వి సింధు అవార్డులు  :  pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton  ins.media

క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

Posted 4 days ago | Category : sports

 క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

Posted 9 days ago | Category : sports

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

కోహ్లి రికార్డుల మోత..!

Posted 9 days ago | Category : sports

కోహ్లి రికార్డుల మోత..!

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Posted 9 days ago | Category : sports

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

Posted 11 days ago | Category : sports

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

Posted 12 days ago | Category : sports

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

సఫారీలతో మ్యాచ్ టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

Posted 12 days ago | Category : sports

సఫారీలతో మ్యాచ్  టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

Posted 14 days ago | Category : sports

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!