//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రోబో 2 . o సెన్సార్ రివ్యూ

Category : movies

సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న మూవీ 2.ఓ. ఈనెల 29న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 550కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.

ఈ మూవీ తెలుగు రాష్ట్రాలు , తమిళనాడు , కర్నాటక , కేరళతో పాటు ఉత్తరాదిన ఈ చిత్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతోంది. తమిళనాడు , మలేషియా , అమెరికా , బ్రిటన్ , చైనా , జపాన్ మార్కెట్లను టార్గెట్ చేసి అత్యంత భారీగా రిలీజ్ చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ నుంచి ఈసారి వసూళ్ల పరంగా భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే రిలీజైన ట్రైలర్ 50 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ స్థాయి లో ప్రేక్షకులను చేరుకుంది. దీనిబట్టి సినిమా కోసం రజిని అభిమానుల తో పాటు ప్రేక్షకులు కూడా ఎంత ఆశక్తి తో ఎదురు చూస్తున్నారో అర్థంచేసుకోవచ్చు. ట్రైలర్ తోనే అదరగొడుతున్న రోబో ఇక సినిమాతో సంచలనాలు నమోదు కావడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

రజనీ చిట్టీగా చేయబోతున్న విన్యాసాలు ,అక్షయ్ క్రోమ్యాన్ గా విన్యాసాలు వీక్షించేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు.అసలు విషయానికి వస్తే రోబో 2 .ఓ సెన్సార్ పూర్తిచేసుకుని U/A సర్టిఫికెట్ అందుకుంది.సినిమాని సెన్సార్ చేసిన సభ్యులు మూవీ ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యారట. హాలీవుడ్ పిక్చర్స్ ని తలదన్నేలా శంకర్ ఈ మూవీ ని తీర్చిదిద్దాడట. సినిమా లో కనబరిచిన విజువల్స్ కన్నుల పండగ లా ఉన్నాయ్, రజిని, అక్షయ్ సీన్స్ అయితే అద్భుతంగా అంటూ సెన్సారు సభ్యులు వాపోతున్నారు. సెన్సార్ టాకే ఈ రేంజ్ లో ఉంటా ఇంకా సినిమా ఇండియన్ సినిమా హిస్టరీ ని తిరగరాస్తదని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.