దుబాయ్ ప్రజలకు రోబో పోలీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ రోబో మానవ రూపంలో కనిపిస్తుంది. నేరాలను నివేదించడానికి, జరిమానాలను చెల్లించడానికి, ప్రశ్నలను అడగడానికి దుబాయి ప్రజలకు ఈ రోబో అందుబాటలోకొచ్చింది. రోబోలోని సెన్సార్లు నేరాలను గుర్తించడంలో సమర్ధవంతంగా పనిచేసేలా రూపొందించారు నిపుణులు. 2030 నాటికి 25 శాతం రోబోటిక్ పోలీసులను ఏర్పాటుచేయనున్నట్లు దుబాయ్ పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ రోబో పోలీస్ చక్రాల సాయంతో నడుస్తూ ప్రజలకు సన్నిహితంగా ఉంటుంది. ప్రజలు తమకు జరిగిన నేరాలను దీనికి ఫిర్యాదు చేసుకోవచ్చు. కాకపోతే రోబో పోలీస్ నేరస్తులను అరెస్ట్ చేయలేదు. అధికారులకు సందేశాన్ని అందించగలదు. రాబోయే కాలంలో రోబో పోలీస్లు ఇంత స్నేహంగా ఉండకపోవచ్చునని అంటున్నారు అధికారులు.